యువతి అశ్లీల వీడియో కేసులో ట్విస్ట్: వారికి తోడు ఇద్దరు యువతులు

By telugu team  |  First Published Jun 29, 2020, 7:19 AM IST

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో బిటెక్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడి అశ్లీల వీడియోలు తీసి వేధిస్తున్న కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు యువతుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


గుంటూరు: అశ్లీల వీడియోల ద్వారా యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అశ్లీల వీడియోలు చిత్రీకరించి యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులో పోలీసులు వరణ్, కౌశిక్ అనే ఇద్దరు యువకులను దిశ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో జరిగింది. 

యువతి అశ్లీల వీడియోల కేసులో ఇద్దరు యువతుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరుణ్ స్నేహితురాలికి, కౌశిక్ సోదరికి అశ్లీల వీడియోలు పంపించారని, వారు వాటిని పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేశారని పోలీసులు గుర్తించారు. 

Latest Videos

undefined

Also Read: బిటెక్ విద్యార్థినిపై సహ విద్యార్థుల అఘాయిత్యం: నెట్ లో నగ్న చిత్రాలు

ఇద్దరు యువతులపై కేసు పెట్టే దిశగా పోలీసులు ఆలోచన చేస్తు్ననారు. ఇద్దరు యువకులు ఒకరి తర్వాత ఒకరు బాధిత యువతిని ప్రేమించినట్లు నమ్మించి, అశ్లీల వీడియోలు తీసి మూడేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నారు. 

విషయం బాధిత యువతి కుటుంబ సభ్యులకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బిటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం చేసి, అశ్లీల వీడియోలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి తాగించి స్పృహ తప్పిన తర్వాత యువతిపై వారు అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఆ వీడియోలను పోర్న్ సైట్లలో పెట్టి వేధిస్తున్నారు. ఈ వ్యవహారం 2017 నుంచి సాగుతూ వచ్చింది. 

click me!