గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై తోటి విద్యార్థులు లైంగిక దాడి చేశారు. యువతికి మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియోలు చిత్రీకరించారు. వాటిని చూపించిన అత్యంత దారుణంగా వ్యవహరించారు. 

అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్టు చేశారు. 

2017 నుంచి ఇద్దరు విద్యార్థులు యువతి నగ్న చిత్రాలను నెట్ లో పెట్టి వేధిస్తున్నారని గుంటూరు అర్భన్ ఎస్పీ చెప్పారు. మొదట యువతి ఫొటోలను నెట్ లో పెట్టి తాత్కాలికంగా డిలీట్ చేశారని చెప్పారు. ఆ యువతి మరొకరికతో సన్నిహితంగా ఉందని చెప్పే దృశ్యాలను మరో యువకుడికి చూపించారని అన్నారు. 

నిందితులు కౌశిక్, వరణ్ అనే ఇద్దరు యువకులుకు బాధితురాలి వీడియోలను పోర్న్ సెట్ లో పెట్టారని చెప్పారు. ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.