వైసిపి బాషలోనే ''నీ అమ్మ మొగుడెవరు'': జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేష్

By Arun Kumar PFirst Published Feb 17, 2020, 4:10 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ఆయన హయాంలో రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమరావతి: ''మీ నాన్న ఎవరు అని తెలుగు లో అడుగుతాం. హూ ఈజ్ యువర్ ఫాదర్ అని ఇంగ్లీష్ లో అడుగుతాం. వైకాపా భాషలో నీ అమ్మ మొగుడు ఎవరు అని అడుగుతారు'' అంటూ టిడిపి జాతీయ కార్యదర్శి  నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. అయితే వైసిపి నాయకుల బాషను సోషల్ మీడియాలో వాడాల్సిన అవసరం లేదని... తుగ్లక్ పాలన గురించి ప్రజలకు అర్ధం అయ్యేలా మాట్లాడండి చాలు అంటూ లోకేష్ తెలుగుదేశం విద్యార్థి విభాగం నాయకులకు సూచించారు. 

టిఎన్ఎస్ఎఫ్ మేధోమదన సదస్సు లో నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశాన్ని దోచి, జైలుకి వెళ్లి వచ్చి కూడా ముఖ్యమంత్రి అవ్వొచ్చని  జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలిసిందన్నారు. అయితే అలా అందరూ తప్పులు చెయ్యడం మొదలు పెడితే దేశానికే ప్రమాదమని... అలాంటి కోరికలు తనకుకు లేవని అన్నారు. 

''పాదయాత్రలో బాబు వచ్చారు... అయినా  జాబు రాలేదు అన్నారు అధికారం లోకి వచ్చాకా వారే స్వయంగా బాబు వచ్చారు  జాబు వచ్చింది అని ఒప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటూ అసత్యాల యాత్ర చేసిన జగన్ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతున్నారు. టిడిపి హయాంలో రాష్ట్ర యువతకి 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ నిజాన్ని ఒప్పుకున్నారు'' అని  అన్నారు.

''పరిశ్రమల ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు వచ్చాయని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెప్పింది.ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్  ప్రమోషన్ పాలసీ పేరుతో వైకాపా ప్రభుత్వం రూపొందించిన పాలసీలో టిడిపి హయాంలో రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.51 లక్షల ఉద్యోగాలు ఒక్క ఉత్పత్తి రంగంలోనే వచ్చినట్టు ప్రకటించారు'' అని అన్నారు.

''అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాం. విశాఖ ఐటీ ,మెడికల్ హబ్ ,రాయలసీమ ఎలక్ట్రానిక్స్,ఆటోమొబైల్ హెడ్ క్వార్టర్ గా తయారు చేసాం. ఒక్క ఫ్యాక్స్ కాన్ కంపెనీ లో 20 వేల మంది మహిళలు పని చేస్తున్నారు. కియా రావడం వల్ల అనంతపురం జిల్లా అభివృద్ధి చెందింది. ఇవన్నీ వైకాపాలా కార్యకర్తలకు దొడ్డి దారిలో ఇచ్చిన ఉద్యోగాలు కావు. నిరుద్యోగ యువతకి బాబు ఇచ్చిన జాబులు''అంటూ వైసిపికి చురకలు అంటించారు.

''జగన్ వస్తే ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి కేవలం వైకాపా కార్యకర్తలకు మాత్రమే వచ్చాయి. 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని డప్పు కొడుతున్నారు.  ఇచ్చింది ఎవరికీ వైకాపా కార్యకర్తలకు. గ్రామ సచివాలయం ఉద్యోగాలు మరో బోగస్.పేపర్ లీక్ చేసారు. ఒక్కొక్కరికి 5 లక్షలకు అమ్ముకున్నారు. 20 లక్షల మంది యువకులను అన్యాయం చేసారు'' అని ఆరోపించారు.

''ఉత్తరాంధ్ర కి అన్యాయం చేసింది జగనే. ఉత్తరాంధ్ర కి రావాల్సిన అదానీ, లులూ లాంటి కంపెనీలను తరిమేశారు. జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ విశాఖని దెబ్బతీసింది. ఇక కంపనీ లు అక్కడికి రావడానికి బయపడతాయి. రాయలసీమకి వస్తాం అన్న రిలయన్స్ జియో కంపెనీ ని తరిమేశారు'' అని అన్నారు.

''నిరుద్యోగ భృతి ఎత్తేసారు. యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చేశారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఒక్క రూపాయి విడుదల చెయ్యలేదు. అమ్మ ఒడి పధకం కోసం రూ.6500 కోట్లు పక్క దారి పట్టించారు. బిసి,ఎస్సి విద్యార్థులకు చెందాల్సిన సొమ్ము అది. కార్పొరేషన్ల ద్వారా వారి కోసం ఖర్చు చెయ్యాల్సిన సొమ్ము పక్కదారి పట్టింది. విదేశీ విద్య ద్వారా మనం ఎంతో మంది బడుగు,బలహీన వర్గాల పిల్లలను ఉన్నత చదువులు చదివించాం'' అని అన్నారు.

''9 నెలల్లో ఒక్క రూపాయి విదేశీ విద్య కి ఇవ్వలేదు.అయన పిల్లలు మాత్రం విదేశాల్లో చదువు కోవాలి. మిగిలిన వాళ్లు ఎప్పటికీ ఆయన కాళ్ళ కింద చెప్పులా ఉండాలి అని జగన్ కోరిక. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే ఉన్న ఉద్యోగాలు,ఉన్న కంపెనీలు పోయాయి. కియా యాజమాన్యాన్ని వైకాపా ఎంపీ బెదిరించారు. అందుకే వాళ్లు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపారు'' అని లోకేష్ తెలిపారు. 

click me!