టిడిపి నేతలు వైసిపిలో చేరడానికి కారణమిదే...: ఎమ్మెల్యే పార్థసారథి

By Arun Kumar P  |  First Published Mar 10, 2020, 8:43 PM IST

బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అడ్డుకున్నది చంద్రబాబేనని.. కానీ వైఎస్ జగన్ మాత్రం బీసీల పక్షపాతి అని వైసిపి ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. అందుకు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమన్నారు. 


అమరావతి: ఏపి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబుకు మతి భ్రమించిందని... అందుకే ప్రజలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని  చూస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు దొరక్కపోయినా చంద్రబాబు మాత్రం నోటికొచ్చినట్లుగా  మాట్లాడుతున్నారని... ఓడిపోతామని తెలిసే ఆ నెపాన్ని వైస్సార్సీపీ మీద నెట్టాలని చూస్తున్నారని అన్నారు. 

బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అడ్డుకున్నది చంద్రబాబేనని అన్నారు. బీసీలకు చంద్రబాబు చేసిన మోసాన్ని బీసీలు గమనించాలని సూచించారు. బీసీల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని.. అందుకు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించినట్లు తెలిపారు. 

Latest Videos

read more  ముందు ఈసీ, తర్వాత కోర్టులు... ఆ విషయంలో ప్రభుత్వానికేం పని: నిలదీసిన యనమల

సీఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి వైస్సార్సీపీలో టీడీపీ నేతలు చేరుతున్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొనలేక ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టిడిపి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైస్సార్సీపీ 95 శాతం స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

read more  స్థానికసంస్థల ఎన్నికలు... బాబు ఇలాకాలో రికార్డు మోత

అధికార యంత్రాంగన్ని వాడుకునే అవసరం తమకు, వైసిపి పార్టీకి లేదని అన్నారు. తాము దైర్యంగా వైఎస్ జగన్ సైనికులమని చెప్పి ఓట్లు అడుగుతామని... ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నమ్మకంతోనే ప్రజలు ఓట్లేస్తారని నమ్మకం వుందని పార్థసారథి అన్నారు. 

click me!