మద్దాలి గిరికి కీలక పదవి... అధికారికంగా ప్రకటించిన వైసిపి సర్కార్

By Arun Kumar P  |  First Published Jan 24, 2020, 9:30 PM IST

ప్రతిపక్ష టిడిపికి షాకిచ్చి వైసిపికి చేరువైన గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ కి  ప్రభుత్వం కీలకపదవి కట్టబెట్టింది. 


గుంటూరు: ప్రతిపక్ టిడిపిని కాదని అధికార  జై కొట్టిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరికి  వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవిని కట్టబెట్టింది. గుంటూరు మిర్చియార్డు గౌరవ ఛైర్మన్ గా గిరిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికి ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఇక ఈ మిర్చియార్డు ఛైర్మన్ గా చంద్రగిరి ఏసురత్నం, వైస్ ఛైర్మన్ లుగా శృంగవరపై శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. 

గత ఏడాది చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జగన్‌కు జై కొట్టారు. వైసీపీలో చేరుతానని ప్రకటించారు. చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్‌‌పై వంశీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో వల్లభనేని వంశీపై టీడీపీ నాయకత్వం  ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో వంశీ అసెంబ్లీలో తనకు ప్రత్యేక సీటును కేటాయించాలని కోరారు. వంశీ కోరిక మేరకు  స్పీకర్ తమ్మినేని సీతారాం మన్నించారు. వంశీకి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు.

Latest Videos

undefined

ఈ క్రమంలోనే టిడిపికి మరో షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.  మంత్రి వెల్లంపల్లితో కలిసివచ్చి సీఎంను కలిసిన గిరి ప్రభుత్వ పథకాలపై ప్రశంసలు కురిపించారు. 

read more  మండలి ఛైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు... బొత్సపై మండిపడ్డ యరపతినేని

రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని మద్దాలి గుర్తుచేశారు. రాజధాని అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన ఆలోచన ఉందని.. లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ఆయన తనతో చెప్పారని మద్దాలిగిరి తెలిపారు.

ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన గిరి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరికి గల్లా జయదేవ్‌ దగ్గరుండి టికెట్ ఇప్పించారు. వైసీపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడే ఆయన వేగంగా అధిష్టానం వద్ద మార్కులు వేయించుకున్నారు.

read more  పోతుల సునీత అమ్ముడుపోయి రోజుకూలిగా మారిపోయారు..: వంగలపూడి అనిత

కాగా గిరి ఎన్నికను రద్దు చేయాలంటూ వైసీపీ నేత, ఆయన ప్రత్యర్ధి చంద్రగిరి ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  ఆయన మొత్తం ఐదు పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఎగవేతకు పాల్పడ్డారని ఏసురత్నం పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి మిర్చియార్డు పదవులు కట్టబెట్టి ఒక్కదగ్గరికి చేర్చడం చర్చనీయాంశంగా మారింది.   

 

click me!