నైపుణ్యాభివృద్ధి లో దేశంలోనే ఏపి నెంబర్‌వన్... జర్మన్ ప్రతినిధులతో మంత్రి మేకపాటి

By Arun Kumar PFirst Published Nov 27, 2019, 8:37 PM IST
Highlights

లోగో డిజైనింగ్, బ్రాండింగ్ లో పేరున్న  జర్మనీకి చెందిన ‘యాక్జెల్ ఏంజెలీ’ ప్రతినిధులు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని  కలిశారు. వీరితో విశాఖపట్నం బ్రాండింగ్ పై మంత్రి ప్రధానంగా చర్చించారు.  

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యాభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై పరిశ్రమలు,ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వేగం పెంచారు. ఇందులో భాగంగా మంత్రి  'కేపీఎంజీ’ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నైపుణ్యాభివృద్ధి లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న విషయాన్ని మంత్రి ప్రతినిధుల వద్ద ప్రస్తావించారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం ప్రకారం యువతకు ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా నైపుణ్యరంగంలో ఏపీని రోల్ మోడల్ గా నిలబెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అందుకు ఇతర రాష్ట్రాలలో ఉన్న అత్యుత్తమ విధానాలలో..ఏపీ అనుసరించాల్సిన మార్గాలపైనా ప్రత్యేక శ్రద్ధపెట్టాలని మంత్రి మేకపాటి ‘కేపీఎంజీ’ ప్రతినిధులకు స్పష్టం చేశారు. 

బుధవారం మధ్యాహ్నం సచివాలయంలోని మంత్రి మేకపాటి కార్యాలయంలో కేపీఎంజీ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. నైపుణ్య కొరవడిన సెక్టార్లేవి? ఎక్కువ ఉపాధికి అవకాశాలున్న రంగాలేవి? భవిష్యత్ లో ఉద్యోగాలు అందించే కోర్సులు ఏవి? ప్రభుత్వ లక్ష్యాలను చేరడంలో ‘ప్రైవేటు’ భాగస్వామ్యమెంత? జిల్లాలు, మంత్రిత్వ శాఖల వారీ లక్ష్యాలెలా ఉండాలి? వంటి అనేక అంశాలపై ప్రతినిధులతో మంత్రి చర్చించారు.  

read more  దివ్యాంగుడి పట్ల ముఖ్యమంత్రి జగన్ ఉదారత... భారీ ఆర్థికసాయం

నైపుణ్య విశ్వవిద్యాలయం, నైపుణ్య కొరతపై అధ్యయనం, భారతదేశ నైపుణ్యాభివృద్ధిలో ‘కేఎంపీజీ’ పాత్ర వంటి విషయాలపై మంత్రి చర్చించారు. ప్రభుత్వ లక్ష్యం, నైపుణ్యాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి వివరించారు. భవిష్యత్ లో ప్రపంచ స్థాయి శ్రామిక శక్తిని పెంపొందించడానికి ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రణాళికలు, అధ్యయనాలతో త్వరలో మళ్లీ కలవాలని మంత్రి తెలిపారు. ఈ భేటీలో కేపీఎంజీ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ హాజరయ్యారు.

read more  అమరావతి పర్యటనపై టెన్షన్... కీలక నేతలతో చంద్రబాబు సమావేశం

మంత్రిని కలిసిన 'యాక్జెల్ ఏంజెలీ' ప్రతినిధులు

లోగో డిజైనింగ్, బ్రాండింగ్ లో పేరున్న  జర్మనీకి చెందిన ‘యాక్జెల్ ఏంజెలీ’ ప్రతినిధులు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని  కలిశారు.  బుధవారం మధ్యాహ్నం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో కేబినెట్ భేటీ అనంతరం సమావేశమయ్యారు. 

విశాఖపట్నం బ్రాండింగ్ పై మంత్రి ప్రధానంగా చర్చించారు. ఎన్నో ప్రత్యేకతలు, అవకాశాలు, సదుపాయాలున్న విశాఖను మరింత బ్రాండింగ్ సిటీగా మార్చడమే  ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ప్రతినిధులకు స్పష్టం చేశారు. విశాఖ బ్రాండింగ్ పెంపుకు తగిన దిశానిర్దేశం చేసే ప్రజంటేషన్ తో మరోసారి కలవాలని  మంత్రి ప్రతినిధులకు స్పష్టం చేశారు.  
 

click me!