విధుల్లోంచి సస్పెండ్: మనస్తాపంతో ఈవో ఆత్మహత్య

Siva Kodati |  
Published : Nov 24, 2019, 07:15 PM IST
విధుల్లోంచి సస్పెండ్: మనస్తాపంతో ఈవో ఆత్మహత్య

సారాంశం

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురజాల మండలంలోని దైద ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న అనిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. దైదతో పాటు గురజాలలోని ఆలయంలోనూ ఆమె ఈవోగా పనిచేస్తున్నారు

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురజాల మండలంలోని దైద ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న అనిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. దైదతో పాటు గురజాలలోని ఆలయంలోనూ ఆమె ఈవోగా పనిచేస్తున్నారు.

లెక్కలు చూపించకుండా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దేవాదాయ శాఖ విచారణకు ఆదేశించింది. అనంతరం ఈ అభియోగాలు నిజమేనని రుజువుకావడంతో ఈ నెల 18న అనితను విధుల్లోంచి సస్పెండ్ చేశారు.

దీనికి తోడు ఆమెకు భర్తతో మనస్పర్థలు రావడంతో ప్రస్తుతం తండ్రి అంజయ్యతో కలిసి ఆమె నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలకు తోడు ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడంతో మనస్తాపానికి గురైన అనిత బలవన్మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా