రివర్స్ టెండరింగ్...చంద్రబాబు, లోకేశ్ ల భారీ దోపిడీకి అడ్డుకట్ట: బొత్సా

By Arun Kumar P  |  First Published Nov 29, 2019, 5:29 PM IST

టిడిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిన టిడ్కో హౌసింగ్ లో చంద్రబాబు, ఆయన తనయుడు  లోకేశ్ భారీ దోపిడీకి పాల్పడినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవన్నీ ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ లో బయటపడుతున్నాయని అన్నారు.  


అమరావతి: రాష్ట్రంలో టిడ్కో హౌసింగ్ లో చేపట్టిన రివర్స్ టెండెరింగ్ ద్వారా రూ.106 కోట్లు ఆదా అయినట్లు మంత్రి బొత్సా సత్నారాయణ ప్రకటించారు. విజయనగరం, విశాఖ, కృష్ణా, చిత్తూరు జిల్లాలో రివర్స్ టెండరింగ్ నిర్వహించామని...ఒక్కో లబ్దిదారుడి దగ్గర 90 వేలు దోచుకు తినేందుకు గత ప్రభుత్వ పెద్దలు సిద్ధపడ్డారని ఆరోపించారు. 

టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్మించి ఇస్తామన్న ఇళ్లలో ఒక్కో స్క్వేర్ ఫీట్ కి 300 రూపాయలు దోపిడీ జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీకి హౌసింగ్ ఒక మచ్చు తునక మాత్రమేనని పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేశ్  సమాధానం చెప్పాలన్నారు. 

Latest Videos

మొత్తం మూడు లక్షల ఇళ్లలో రూ.2,626 కోట్ల దోపిడీకి తండ్రీ కొడుకులిద్దరు ప్లాన్ చేసినట్లు ఆరోపించారు.ఇప్పటికే పలు విభాగాల్లో రివర్స్ టెండెరింగ్ ను అమలుచేయగా మరో 1013 కోట్ల పనులకు రివర్స్ టెండెరింగ్ కు వెళ్తున్నామని వెల్లడించారు.  చంద్రబాబు పాపాలు తుడిచి పెట్టేందుకే భగవంతుడు జగన్ ను గెలిపించాడని అన్నారు. 

read more  నూతన మద్యం పాలసీ... జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పోలీసులను ఉపయోగించిన నిరసనలను అడ్డుకునే అలవాటు చంద్రబాబుకే వుందని... తమకు ఆ అలవాటు లేదన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో కడుపు తరుక్కుపోయిన రైతులే చంద్రబాబు పర్యటనను అడ్డుపడ్డారని పేర్కొన్నారు.

రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ఇంకా మాయమాటలు చెబుతున్నారని...  రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాదిరిగా లోకేష్,చంద్రబాబు వ్యాపారధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేవలం 4 భవనాలు మాత్రమే కట్టి 50 నుంచి 90 శాతం రాజధాని నిర్మాణం పూర్తయినట్లు ప్రచారం చేసుకుంటున్నారని బొత్సా ఆరోపించారు.

read more వైసిపి కుట్రలు... చంద్రబాబు వాహనంపై దాడికి ముందే ప్రణాళిక..: సోమిరెడ్డి 

అమరావతి పర్యటనలో చంద్రబాబు 18 పేజీల అబద్ధాలు ఆడారన్నారు. అమరావతి కోసం రూ. 9060 కోట్లు ఖర్చుచేశామని అన్నారని... అయితే నిజానికి ఖర్చు చేసింది రూ.5900 కోట్లు మాత్రమే అని తెలిపారు. ఆర్కిటెక్ట్ కంపెనీ లతో రూ.840 కోట్ల కు ఎంవోయూలు సైన్ చేసి రూ.320 చెల్లించారని ఇంకా 500 కోట్లు చెల్లించాలన్నారు. 
 


 

click me!