అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ నేను కట్టుబడే వున్నా: బొత్స

By Arun Kumar P  |  First Published Nov 28, 2019, 5:40 PM IST

ఏపి రాజధాని అమరావతిపై మంత్రి బొత్సా సత్యనారాయణ ఇటీవల చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.  అయితే ఈ వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడే వున్నానని తాజాగా బొత్స మరోసారి ప్రకటించారు.  


అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టబడే వన్నానని మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. తాను పచ్చటి పొలాలను స్మశానంగా మార్చారని అన్నానే తప్ప రాజధానిని స్మశానంతో పోల్చలేదని వివరణ ఇచ్చారు. కొందరు కావాలనే తన మాటలకు వేరే అర్థాలు సృష్టించి రాజకీయాల కోసం వాడుకుంటున్నారని పేర్కొన్నారు. 

చంద్రబాబు ఐదేళ్ల పాలన వల్ల రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం రాష్ట్రానికి జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. ఇప్పటివరకూ  అమరావతిలో ఏ నిర్మాణాలు కట్టలేదని..అన్నీ సగం సగం నిర్మాణాలేనని విమర్శించారు. 

Latest Videos

undefined

అసైన్డ్ భూముల విషయంలో రైతులకు అన్యాయం జరిగింది కాబట్టే వారు ఉద్యమిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా దళితుల రైతులు అన్యాయానికి గురై ఇప్పుడు చంద్రబాబుపై తిరగబడుతున్నారని అన్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై విచారణ జరుపుతామని బొత్స వెల్లడించారు. 

read more  రాజధాని అమరావతిపై ఆయన నిర్ణయమే ఫైనల్...: వైసిపి ఎమ్మెల్యే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పర్యటనను రైతులే అడ్డుకున్నారని...వారికి అన్యాయం జరిగింది కాబట్టే అలా చేశారన్నారు. 

హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని కులుకుతున్న చంద్రబాబు అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. అయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ కు అమరావతిలో భూమీ ఉండదు కానీ ఆయన తోడల్లుడుకి 500 ఎకరాలు మాత్రం ఉన్నాయి. ఇదంతా వారి టిడిపి ప్రభుత్వ మాయాజాలమని అన్నారు.

చంద్రబాబుకి అమరావతిలో పర్యటించే అర్హత లేదన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పారదర్శకంగా భూములు ఇస్తామని ఐదేళ్లలో రైతులకు ఏమీ లాభం చేకూర్చారని ప్రశ్నించారు. 

read more  వాటిని కాదని రాజధాని కోసం ఖర్చు చేయమంటారా..?: చంద్రబాబును నిలదీసిన వైసిపి ఎమ్మెల్యే

కేవలం ఒక్క సామాజిక వర్గం ప్రాపకం కోసం మా ప్రభుత్వం పని చేయదన్నారు. చంద్రబాబు పర్యటన రాజకీయ కోణంలో ఉందని ఈ రాజకీయాలను తాము బహిర్గతం చేస్తామన్నారు. సీఆర్‌డీఏ రివ్యూ ఎపుడో నిర్ణయం తీసుకున్నాక చంద్రబాబు టూర్ నిర్ణయం చేయడం విడ్డూరంగా వుందన్నారు. 


 

click me!