మూడు రాజధానుల వెనకున్న రహస్యమిదే: నాదెండ్ల

By Arun Kumar P  |  First Published Jan 11, 2020, 3:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయం వెనుక స్థానికి ఎన్నికల వ్యూహం దాగుందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటుచేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించడం వెనుక పెద్ద రహస్యం దాగివుందని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల  కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ అన్నారు. కేవలం ఏడు నెలల పరిపాలనా కాలంలో వైసిపి  ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో స్థానిక సంస్థల  ఎన్నికల్లో ఆ  పార్టీ నాయకులు ప్రజలవద్దకు వెళ్లలేని పరిస్థితి  ఏర్పడిందన్నారు. అందువల్లే  మూడు రాజధానుల ప్రకటనతో ప్రజల దృష్టిని మరల్చడానికి చూస్తున్నారని నాదెండ్ల వెల్లడించారు. 

ఏపి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని... కేవలం  వైసిపి నాయకులకే లబ్ది చేకూరుతుందన్నారు. అందుకోసమే జగన్ అమరావతి నుండి రాజధానిని వేరే నగరాలకు తరలిస్తున్నారని... అయితే ఈ ప్రయత్నాన్ని జనసేన  పార్టీ అడ్డుకుని తీరుతుందన్నారు. 

Latest Videos

undefined

read more  బిసి వర్గీకరణ...ఏపి సీఎం జగన్ కీలక నిర్ణయం

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ సారథ్యంలో మంగళగిరిలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పాల్గోన్న  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజధాని ఒకచోట,పరిపాలన మరోచోట వుండటం సాధ్యమయ్యే పనికాదని ఈ రెండూ ఒకచోట వుంటేనే సుస్థిర పాలన సాధ్యమని అన్నారు. 

 గతంలో ఓదార్పుయాత్ర పేరుతో రాష్ట్రంమొత్తం కాలినడకన తిరిగిన అవసరమున్నా, లేకున్నా ప్రజలను పలకరించారని... ఇప్పుడేమో అధికారంలో వచ్చాక ప్రజలతో మరీ ముఖ్యంగా రైతులతో కనీసం మాట్లాడకపోవడం దారుణమన్నారు. అంతేకాకుండా పోలీసులను ఉపయోగించిన వారిపై  దాడులు చేయించడం మరీ దారుణమన్నారు. 

read more  రాజధాని ఉద్యమంలో విషాదం...భూమినిచ్చిన రైతు హఠాన్మరణం

పోలీసుల చర్యలతో రాజధానిలో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న మహిళల్ని కూడా  పోలీసులు దారుణంగా కొట్టారని ఆరోపించారు. పోలీసులు రాజధాని గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి తాళాలు వేస్తున్నారని...తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులను ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధించడం తగదని నాదెండ్ల తెలిపారు. 

click me!