తెనాలి బార్ లో దారుణ హత్య: వ్యక్తిని చంపి పరార్

By telugu team  |  First Published Oct 24, 2020, 8:17 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని బార్ అండ్ రెస్టారెంట్ లో దారుణమైన హత్య జరిగింది. సుబానీ అనే వ్యక్తిని రఫీ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు.


గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ హత్య జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో ఓ వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. 

శుక్రవారం రాత్రి సుభానీ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి నందుపేటలోని బార్ అండ్ రెస్టారెంట్ కు మద్యం సేవించడానికి వెళ్లాడు. అక్కడికి షేక్ రఫీ అనే వ్యక్తి వచ్చాడు సుభానీకి, రఫీకి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రఫీ సుభానీని కత్తితో పొడిచాడు. విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో సుభానీ అక్కడికక్కడే మరణించాడు. 

Latest Videos

హత్య చేసిన తర్వాత షేక్ రఫీ అక్కడి నుంచి పరారయ్యాడు. షేక్ రఫీని ఆపే ప్రయత్నం బార్ లో ఏ ఒక్కరు కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఘటన జరిగిన వెంటనే సుభానీతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యాడు. 

మద్యం మత్తులో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. అయితే, పథకం ప్రకారమే రఫీ సుభానీని హత్య చేయడానికి వచ్చాడనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

click me!