ఇంట్లో నిద్రిస్తుండగా కత్తితో దాడి...తెనాలిలో దారుణ హత్య

Arun Kumar P   | Asianet News
Published : Oct 21, 2020, 11:41 AM IST
ఇంట్లో నిద్రిస్తుండగా కత్తితో దాడి...తెనాలిలో దారుణ హత్య

సారాంశం

గాడనిద్రలో వున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసి అతి దారుణంగా హతమార్చిన ఘోరం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.   

గుంటూరు: రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి తెల్లారేసరికి రక్తపుమడుగులో శవమై తేలాడు. అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు గాడనిద్రలో వున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసి అతి దారుణంగా హతమార్చిన ఘోరం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్ లో ధనావత్ చంద్ర నాయక్ భార్య జ్యోతితో కలిసి నివాసముంటున్నాడు. అయితే అతడికి దుండిపాలెం గ్రామానికి చెందిన బంధువు సాయితో కలహాలున్నాయి. ఈ క్రమంలో చంద్రను చంపడానికి సాయి కుట్ర పన్ని అతి దారుణంగా హతమార్చినట్లు మృతుడి భార్య జ్యోతి అనుమానం వ్యక్తం చేస్తోంది. 

మంగళవారం రాత్రి చంద్ర తన ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా ఎవరో కత్తితో నరికి చంపారు. దీంతో తీవ్ర రక్తస్రావమై నిద్రలోనే అతడు మృతిచెందాడు. తెల్లవారుజామున రెండు  గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమీప బంధువు సాయి ఈ దారుణానికి పాల్పడినట్లు మృతుని భార్య జ్యోతి అనుమానం వ్యక్తం చేసింది. 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా