ఆ వెధవ పని చేసింది చంద్రబాబే... రాజధానిపై ఉద్యోగ సంఘం నేత కీలక వ్యాఖ్యలు

Arun Kumar P   | Asianet News
Published : Jan 07, 2020, 07:07 PM ISTUpdated : Jan 07, 2020, 09:34 PM IST
ఆ వెధవ పని చేసింది చంద్రబాబే... రాజధానిపై ఉద్యోగ సంఘం నేత కీలక వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని ఎంపిక చేయడంలోనే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఏపి సచివాలయ ఉద్యోగసంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఆరోపించారు. 

అమరావతి: రాజధాని తరలింపు విషయంలో జరుగుతోన్న ప్రచారం ఉద్యోగుల్లో కలవరానికి కారణమవుతోందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి తెలిపారు. అయితే ఇంత తొందరగా తరలింపు సాధ్యం కాదు కాబట్టి ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 

ప్రభుత్వం ఎన్నివిధాల ప్రయత్నాలు చేసినా ఇప్పట్లో తరలింపు జరగనే జరగదన్నారు. అకడమిక్ ఇయర్ మధ్యలో తరలింపు అస్సలు సాధ్యపడదన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను గుర్తించి న్యాయం చేస్తుందనే నమ్మకముందన్నారు. రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకున్నాక తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

read more  జగన్ కు జాతకాల పిచ్చి... అందుకోసమే కేసీఆర్ తో భేటీ: బైటపెట్టిన జవహర్

గతంలో ఉద్యోగులను భయపెట్టిన చరిత్ర చంద్రబాబుదని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఇప్పుడు కూడా ఆయన ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని అన్నారు. రాజధాని అమరావతిలో పెట్టడం సమంజసమేనా..? మునిగిపోతుందని తెలిసీ రాజధాని నగర నిర్మాణం చేపట్టే వెధవ పని చేసింది చంద్రబాబు కాదా..? అని వెంకట్రామి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా