తెనాలిలో దారుణం: లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య

By Siva Kodati  |  First Published Oct 10, 2019, 1:35 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. రైల్వే‌స్టేషన్‌కు సమీపంలోని ఓ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది


గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. రైల్వే‌స్టేషన్‌కు సమీపంలోని ఓ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే..  బుధవారం ఓ ప్రేమ జంట రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు.

సాయంత్రం చెక్ అవుట్ చేస్తామని చెప్పి.. ఎంతకు బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం కలిగి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి చూసే సరికి ఇద్దరూ విగత జీవులుగా పడివున్నారు.

Latest Videos

మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరిని అమరావతి మండలం జూపూడికి చెందిన సాగర్‌బాబు, కృష్ణాజిల్లా కంకిపాడుకి చెందిన తేజస్విగా గుర్తించారు.

యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. తేజస్వి మణికట్టు వద్ద బ్లేడుతో గాయం చేసుకోవటంతో మరణించినట్లుగా పోలీసులు నిర్థారించారు. కాగా.. తమ కుమార్తె కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

click me!