బిజినెస్‌మెన్ సినిమానే జగన్ ఫాలో అవుతున్నారు: బుద్దా వెంకన్న

By Arun Kumar PFirst Published Oct 10, 2019, 1:34 PM IST
Highlights

టిడిపి నాయకులు బుద్దా  వెంకన్న వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 

ఆరేళ్ల క్రితం వచ్చిన బిజినెస్ మెన్ సినిమానే ఏపి సీఎం జగన్ ఫాలో అవుతున్నాడని టిడిపి నాయకులు బుద్దా వెంకన్న ఆరోపించారు. అందులో హీరో మహేష్ బాబు   సూర్య టాక్స్ విధిస్తే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా మద్యపాన నిషేధం అనే పేరుతో 'జె' టాక్స్ విధిస్తున్నాడని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో మధ్యపాన నిషేదం పేరుతో భారీ స్కాం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ఎమ్మార్పీ రేట్ల కంటే రూ.20 ఎక్కువకు మద్యం అమ్ముతోందని అన్నారు. ఇలా దేశంలోనే కాదు ప్రపంచం లో ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వమే చట్టాలను అతిక్రమిస్తే ఎలా అని ప్రశ్నించారు.


మద్యపానం 3000 వేల కోట్ల రూపాయల భారీ స్కామ్ అని అన్నారు. ఈ నిర్ణయంతో  పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పవిత్రమైన దసరా పండగరోజు అర్ధ రాత్రి కూడా మద్యం షాపు లు తెరిచి అమ్మకాలు చేశారని వెంకన్న ఆరోపించారు. ఇలా టిడిపి ప్రభుత్వం లో ఏనాడూ జరగలేదన్నారు. 

 మద్యం అమ్మకాలు ఎంత ఉంటే 'జె ' టాక్స్ అంత పెరుగుతుందని తెలిపారు. చదువుకున్న వ్యక్తులని మద్యం షాపుల్లో పెట్టారు... ఇదా మీ మద్యపాన నిషేధంఅని ప్రశ్నించారు. 

తెలుగుదేశం అనేది తెలుగు ప్రజల పార్టీ.. ప్రజల సమస్యలను గొంతెత్తి వినిపించే పార్టీ అని అన్నారు. కేవలం మద్యమే కాదు ఈ రాష్ట్రంలో ఏది కొనాలన్న సర్వీస్ టాక్స్ తో పాటు 'జె'టెక్స్ కట్టాల్సిన పరిస్థితి వుంది. ఈ జె టాక్స్ పై ప్రతి ఒక్కరు నోరు విప్పాలని సూచించారు. 

కోట్ల కుంభకోణం చేసిన వ్యక్తికి ముఖ్యమంత్రి హోదా ఇస్తే పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైందన్నారు.  జె ట్యాక్స్ అనేది జగన్  విరమించుకోవాలని సూచించారు. ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యాపారాలన్నీ కుదేలయిపోయాయని బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. 

click me!