రేషన్ బియ్యం గోతాలకు చిల్లుపడటంతో లారీ నుంచి బియ్యం రోడ్డుపైకి జారి పడిపోయాయి. మంగళగిరి పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట గౌతమబుద్దారోడ్డుపై బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఒక్కపూట కూడా తిండి దొరకక ఇబ్బంది పడుతున్నవారు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. ఆకలి చావులు లెక్కలేనన్ని చోటుచేసుకుంటున్నాయి. పట్టెడు అన్నం సంపాదించుకోవడానికి నానా చాకిరి చేసేవారు కోకొల్లలు. ఇలాంటి వారిని ఇబ్బందులు తీర్చేందుకే ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అందులో భాగంగానే పేద ప్రజలకు తక్కువ మొత్తానికే రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు.
అయితే... ఆ రేషన్ బియ్యం పేదల ఆకలి తీర్చకముందే రోడ్డు పాలయ్యింది. రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్న లారీలో నుంచి బియ్యం రోడ్డు మీద దారలా పోవడం గమనార్హం. ఈ సంఘటన మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది.
undefined
పూర్తి వివరాల్లోకి వెళితే.. రేషన్ బియ్యం గోతాలకు చిల్లుపడటంతో లారీ నుంచి బియ్యం రోడ్డుపైకి జారి పడిపోయాయి. మంగళగిరి పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట గౌతమబుద్దారోడ్డుపై బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గమనించిన వాహనదారులు లారీ డ్రైవర్ కు చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా అలాగే ముందుకుసాగాడు. పేదల బియ్యం రోడ్డుపాలైనా డ్రైవర్ పట్టించుకోవకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎంతో మంది పేదల ఆకలి తీర్చే బియ్యాన్ని అలా రోడ్డు పాలు చేసి ఎవరికీ ఉపయోగం లేకుండా చేయడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.