అందుకోసమే అధికారులపై వేటు... వైసిపి ప్రణాళిక ఇదే...: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Feb 10, 2020, 8:39 PM IST
Highlights

ప్రభుత్వ అధికారులపై కక్షసాధింపులకు పాల్పడుతున్న వైసిపి ప్రభుత్వానికి సహకరిస్తున్న అధికారులు కూడా జాగ్రత్తగా వుండాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హెచ్చరించారు.  

గుంటూరు: స్వతంత్ర భారతదేశంలో ఇంతలా కక్ష సాధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్ పై టిడీపీ శాసనసభాపక్షనేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం హయాంలో పనిచేసిన అధికారులను సస్పెండ్‌ చేస్తూ వైసిపి ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని మండిపడ్డారు. డీజీ స్థాయి అధికారి, సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారులతో సహా పలువురు సీనియర్‌ అధికారులను బలిచేయడానికి వైసిపి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. 

read more  ఈ ఒక్కసారే ఇక్కడ...వచ్చే ఏడాది వైజాగ్ లోనే..: మంత్రి అనిల్

ముఖ్యమంత్రి కక్ష సాధింపులకు అధికారులు వంత పాడటం మంచి విధానం కాదని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్‌ అధికారిగా పనిచేశారనే ఒకే ఒక్క కారణంతో ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష కట్టి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. 

గతంలో జాస్తి కృష్ణ కిషోర్‌ వ్యవహారంలోనూ ఇదే విధంగా వ్యవహరించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఒకే ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉండదనే విషయం అధికారులు గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాలకు తల ఊపే ముందు అధికారులు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. 

ముఖ్యమంత్రి చట్టవ్యతిరేకంగా పాలన చేస్తుంటే.. అది మంచి పద్ధతి కాదని చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. 8 నెలల్లోనే వైసిపి ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని... రాష్ట్రంలో ఏ ఇద్దరు వ్యక్తులు మ్లాడుకున్నా జగన్మోహన్‌ రెడ్డిని దూషిస్తున్నారని చెప్పుకొచ్చారు. 

read more   వైసిపిలో అసమ్మతి సెగలు... మహాఅయితే మరో మూడేళ్లు మాత్రమే...: బుచ్చయ్య చౌదరి

ప్రజావ్యతిరేకతపై దృష్టి మరల్చడానికి మూడు రాజధానుల వ్యవహారం, అధికారుల సస్పెన్షన్‌ ఇలా రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. మోసం, దగా, కుట్రలు ఎల్లకాలం నడవవని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

click me!