కంటివెలుగు... గుంటూరు జిల్లాలో ఎవరెక్కడ ప్రారంభించారంటే

By Arun Kumar P  |  First Published Oct 10, 2019, 4:08 PM IST

గుంటూరు జిల్లా వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యింది.  


గుంటూరు : గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సాఆర్‌ కంటివెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నిజాపట్నంలోని​ జడ్పీ ఉన్నత పాఠశాలలో మార్కెటింగ్‌ శాఖ
మంత్రి మోపిదేవి వెంకటరమణ వైఎస్సాఆర్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

వినుకొండ గర్ల్స్‌ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి హోలీ ఫ్యామిలీ స్కూల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

Latest Videos

జగన్ ను నమ్మిన ఎన్టీఆర్ సన్నిహితుడు: డబుల్ ధమాకా కొట్టేసిన హరికృష్ణ దోస్త్

నర్సరావుపేట అంబేద్కర్‌ స్కూల్‌లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, బాపట్ల మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, పెనుమాములిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రారంభించారు. 

తెనాలి కోగంటి శివయ్య హైస్కూల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, గుంటూరు రూరల్‌ మండంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిలు వైఎస్సాఆర్‌ కంటివెలుగు
కార్యక్రమాన్ని ప్రారంభించారు.

click me!