తెలుగు కంటే ఇంగ్లీషే ఈజీ... ప్రభుత్వానికి మేమిచ్చే నివేదిక ఇదే: జస్టిస్ ఈశ్వరయ్య

By Arun Kumar PFirst Published Dec 28, 2019, 5:53 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఇంగ్లీష్, తెలుగు మీడియంలను పోలుస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.  

అమరావతి: తెలుగు భాష కంటే ఆంగ్లం నేర్చుకోవడం చాలా సులభమని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆంగ్లంలో ఏ రాయడం కంటే తెలుగులో అ అనే అక్షరం రాయడం కష్టమని అన్నారు. వెనుకబడిన తరగతుల వారు నేర్చుకోకూడదనే కొందరు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారని ఈశ్వరయ్య ఆరోపించారు.

ఫీజుల నియంత్రణకు సంబంధించి ఫిబ్రవరి లో ప్రభుత్వనికి నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు. యాజమాన్య కోటా, కన్వీనర్ కోటా ఫీజులు వేర్వేరుగా ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ప్రస్తుతం కళాశాలల్లో తనిఖీలు జరుగుతున్నాయని వెల్లడించారు.  

ఈ క్రమంలో 20 శాతం మేర ఫీజులు పెంచాలని కళాశాలల యాజమాన్యాలు డిమాండు చేస్తున్నాయనిపేర్కొన్నారు. అయితే తాము మాత్రం ఖర్చులకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు ఈశ్వరయ్య తెలిపారు.  

read more ఒరిస్సా తీరంలో అల్పపీడనం... ఏపి తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక....

''ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం అన్న అంశంపై కొన్ని వివరాలను తెలియచేయలని భావిస్తున్నాను. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేదు. పూర్వం సంస్కృతంలో విద్యా బోధన జరిగేది. శూద్రులకు విద్యా హక్కు కూడా లేదు. బ్రిటీషర్లు పాఠశాలల్లో కొన్నిచోట్ల ఆంగ్ల మాధ్యమం పెట్టారు.

వెనుక బడిన కులాలకు అప్పుడు కూడా ఆంగ్ల మాధ్యమం లేక ఉన్నత ఉద్యోగాలు పొందలేక పోయారు. కేవలం చదువు, మాధ్యమాల కారణంగా సమాజం రెండుగా విడిపోయింది. ఆర్టికల్ 191ఏ ప్రకారం అందరికి విద్యా బోధన మాధ్యమం ఎంచుకునే హక్కు ఉంది. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం గురించిన డిమాండ్ ప్రజల్లో ఉంది. 

read more  జగన్ ప్రధాని... విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కోర్టుల్లో, పాలనా వ్యవహారాల్లో ఆంగ్లంలోనే జరుగుతోంది. ఇలాంటప్పుడు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఉంటే తప్పేంటి. ఉన్నత స్థాయి విద్యలో రాణించాలనంటే ఆంగ్ల మాధ్యమం ఉండాల్సిందే. నా వ్యక్తిగతంగా కూడా ఆంగ్ల భాషలో వెనుకబడి ఉన్నత స్థాయికి వెళ్లలేక పోయాను'' అంటూ ఈశ్వరయ్య ఆవేధన వ్యక్తం చేశారు. 

 

click me!