రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్... తాజాగా మరింత ఆదా: బొత్స

By Arun Kumar PFirst Published Dec 27, 2019, 8:47 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రివర్స్ టెండరింగ్ బాగా సక్సెస్ అవుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు రూ.303 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయినట్లు మంత్రి వెల్లడించారు. 

అమరావతి: రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీని ద్వారా రూ.48 కోట్ల ఆదా జరిగినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు టిడ్కోలో 49 వేల యూనిట్ల పనుల్లో  రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ. 303 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయినట్లు మంత్రి వెల్లడించారు. 

 పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ప్యాకేజి లో రూ. 431.62 కోట్ల అంచనా వ్యయంతో 8448 యూనిట్ల నిర్మాణం కోసం రివర్స్ టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల ప్రక్రియలో ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.384.14 కోట్లకు బిడ్ ను దాఖలు చేసి ఎల్ 1 గా నిల్చింది. 

read more వైన్స్ లు, బార్లు తగ్గించి వాటిని పెంచుతున్నాం... అయినా విమర్శలే: జగన్

గతంలో మూడు విడతల్లో 40,160 యూనిట్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి రూ.255.94 కోట్ల భారాన్ని తగ్గించామని పురపాలక శాఖ మంత్రి  తెలిపారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనుల్లో పిలిచిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో 8 ప్యాకేజిల్లో రూ. 2399 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో 48608 యూనిట్ల  నిర్మాణపు పనుల్లో రూ. 303.24 కోట్లను ఆదా చేశామని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తున్నదని, గృహ నిర్మాణాలకు సంబంధించి మరిన్ని ప్రాజెక్టులకు కూడా రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

read more  పెళ్లాం ఓ చోట, మొగుడు మరో చోట...జగన్ నిర్ణయంపై నారాయణ సెటైర్లు

click me!