పాదయాత్రలో ముద్దులు... పరిపాలనలో గుద్దులు ...: జగన్ పై మాజీ మంత్రి సెటైర్లు

By Arun Kumar PFirst Published Feb 20, 2020, 8:36 PM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై మాజీ మంత్రి జవహర్ విమర్శలు ఎక్కుపెట్టారు. వైసిపి ప్రభుత్వ పాలన రద్దులతో సాగుతోందని ఎద్దేవా చేశారు. 

గుంటూరు: రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై ముఖ్యమంత్రి జగన్ కన్ను పడిందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఇప్పటికే వందల ఎకరాల భూములను ఆక్రమించిన ఆయన ధన ధాహం, భూదాహం ఇంకా తీరినట్లు లేదని... ఎప్పటికీ తీరేలా కూడా లేదని అన్నారు. 

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం జగన్ 9 నెలలుగా అభివృద్ది, సంక్షేమాన్ని గాలికొదిలి కేవలం తన కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానిపై దృష్టి సారించారన్నారు.  ఇళ్ల పట్టాల పేరుతో దళితుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. 

అసైన్డ్ భూములపై దళితులకు మాజీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హక్కులను జగన్ కాలరాస్తున్నారన్నారు. జగన్ కి చిత్తశుద్ది ఉంటే దళితులు భూములు లాక్కోకుండా గతంలో తన తండ్రి వైఎస్ కజ్జా చేసిన పులివెందుల ఎస్టేట్‌లోని అసైన్డ్ భూములను పేదలకు పంచిపెట్టాలన్నారు. అంతేగానీ నిరుపేద దళితులు భూములే ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు.

read more  జగన్ ప్రభుత్వంపై జపాన్ సీరియస్... కేంద్రానికి ఘాటులేఖ...: చంద్రబాబు

ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే భూములను కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. జగన్  షెల్ కంపెనీలకు, సూట్ కేసుల కంపెనీలకు తీసుకున్న భూముల లిస్ట్ విజయసాయిరెడ్డి దగ్గర ఉంటుందని... ఆ భూములు  పంచాలన్నారు. 

దళిత రాజధాని అమరావతిలో 60 రోజుల నుంచి రైతులు ఆందోనళలు చేస్తుంటే జగన్ స్సందించకుండా సచివాలయానికి దొంగ చాటుగా వెళ్లే పరిస్ధితిలో ఉన్నారన్నారు. గతంలో జగన్ పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టారని... పాలనలో రద్దులు చేస్తూ ప్రజలను పిడి గుద్దులు గుద్దుతున్నారని మండిపడ్డారు. 

9 నెలల పాలనలో జగన్ అన్ని విధాల విపలమయ్యారని... దీని నుంచి దృష్టి మళ్లించేందుకు ఇసుక, ఇంగ్లీష్ మీడియం , 3 రాజధానులు, మండలి రద్దు ఇలా అనేక అంశాలను తెరపైకి తెచ్చారని తెలిపారు. అసలు వైసీపీనే జగన్ స్ధాపించలేదని... తెలంగాణకు చెందిన శివ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారని పేర్కొన్నారు.  అలాంటి వైసీపీ నాయకులు టీడీపీని విమర్శించటం సిగ్గుచేటన్నారు. 

read more   మాది వ్యాపార కుటుంబం... నీకు రాజకీయాలే వ్యాపారం. ..: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సవాల్

బైబిల్ పట్టుకుని జగన్, విజయమ్మ దళితులను మోసం చేశారని ఆరోపించారు. పెద్దలు భూముల జోలికి వెళ్లకుంగా జగన్ పేదల భూములే ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. దళితుల భూముల కొట్టేస్తే జగన్ కి శిక్ష తప్పదన్నారు. జగన్ తనని నమ్మిన దళితుల్ని శిలువకు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని తెలిపారు.  వైసీపీ ఎమ్మెల్యే రోజా అవగాహనతో మాట్లాడాలని... రైతులన్ని పెయిడ్ ఆర్టిస్టలనటం సిగ్గుచేటని అన్నారు. జగన్ కి దళిత ఉద్యమం సెగ తప్పదని మాజీ మంత్రి జవహర్ హెచ్చరించారు.


 

click me!