మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన ఆస్తులు హడావుడిగా ప్రకటించడం వెనుక వేరే కారణాలు దాగున్నాయని వైసిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
తాడేపల్లి: టిడిపి జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ హడావుడిగా తన కుటుంబ ఆస్తుల ప్రకటించడం ప్రజల దృష్టి మరల్చడానికేనని వైసిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇలా హడావుడిగా ఆస్తులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనని...లోకేశ్ ప్రకటించిన ఆస్తులన్నీ డూప్లికేటేనని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పనిచేసిన మాజి పిఎస్ ఇంట్లో సోదాలు చేస్తేనే రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని గుర్తుచేశారు. అలాంటిది చంద్రబాబు దగ్గర తక్కువ ఆస్తులున్నాయని లోకేశ్ ప్రకటించినా ఎవరూ నమ్మరన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీ రంగనీతులు...చేసేవన్నీ తప్పుడు పనులేనని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
undefined
చంద్రబాబు 100 తప్పులపై బిజెపి ఛార్జ్ షీట్ కూడా వేసిందని గుర్తుచేశారు. తవ్వేకొద్దీ వేలకోట్ల అక్రమాలు బయటపడుతున్నాయని... ఇలా ఐటి విచారణలో బయటపడుతున్న నిజాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే లోకేశ్ చేత హడావుడిగా ఆస్తుల ప్రకటన చేయించారని ఆరోపించారు. చంద్రబాబు బినామీ ఆస్తులు ప్రకటింపచేస్తే అతిపెద్ద దోపిడీదారుడుగా తెలిపోతుందన్నారు.
read more బాబు మాజీ పీఎస్ పై ఐటీ దాడులు: అహ్మద్ పటేల్ కు లింక్ పెట్టిన విజయసాయి
కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్ కు అందిన ఐటి నోటీసులపై చంద్రబాబు నోరు విప్పాలన్నారు. కాంగ్రెస్ కు కప్పంకట్టడాన్నిబట్టి చూస్తే రాష్ర్ట విభజనకు చంద్రబాబు సహకరించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. దోచుకున్న సొమ్మును తన పరపతిని కాపాడేందుకు చంద్రబాబు ఉపయోగించారని ఆరోపించారు. దోపిడీ సొమ్మును స్వార్ధ ప్రయోజనాలకోసం ఉపయోగిస్తూ...హవాలా మార్గంలో దోపిడీ సొమ్మును పప్పుబెల్లంలా పంచారన్నారు.
చంద్రబాబు చేసిన అవినీతి నుండి ఆ దేవుడైనా కాపాడలేడని... ఆ అవినీతి హవాలా సామ్రాజ్యం బద్దలవుతోందన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుకు తీహార్ జైలుకెళ్లడం తప్పదన్నారు.
read more పెరిగిన బాబు ఆస్తులు:ఫ్యామిలీ ఆస్తులను వెల్లడించిన నారా లోకేష్
పొత్తులు లేకుండా చంద్రబాబు ఏ ఎన్నికలలో గెలవలేదన్నారు. ఐటి దాడులనుంచి దృష్టి మరల్చేందుకే ప్రజాచైతన్య యాత్ర చేపట్టారని పేర్కోన్నారు. తన బినామిలను కాపాడేందుకే ఈ యాత్ర చేపట్టారని...అవినీతితో రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతి పాలు చేశాడని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకువస్తున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు కడుపుమండిపోతోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.