జగన్ ప్రభుత్వంపై జపాన్ సీరియస్... కేంద్రానికి ఘాటులేఖ...: చంద్రబాబు

By Arun Kumar P  |  First Published Feb 20, 2020, 7:37 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 


అమరావతి: విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో వైసిపి ప్రభుత్వానికి అన్నిచోట్లా చుక్కెదురు అవుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాను  చెబుతున్న వినిపించుకోకుండా వ్యవహరించడంతో మొదట హైకోర్టు ఆ తర్వాత కేంద్రం ఈ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయని అన్నారు. తాజాగా ఇప్పుడు ఏకంగా జపాన్ కేంద్ర ప్రభుత్వానికి ఘాటు లేఖ రాసే స్థాయికి పరిస్థితి దిగజారిందన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్ ఆలోచనాతీరులో మార్పు రాకుంటే ఏం చేయలేమన్నారు. 

''నాటి తుగ్లక్ కంటే నేటి తుగ్లక్ చర్యలే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశాలు అవుతున్నాయి. మొన్న వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఏపీ ప్రభుత్వ పీపీఏల రద్దు, విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించకుండా వేధించడం గురించి రాసారు. నిన్న ఇదే అంశమై హైకోర్టు ఆగ్రహించింది.''

Latest Videos

undefined

read more  మాది వ్యాపార కుటుంబం... నీకు రాజకీయాలే వ్యాపారం. ..: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సవాల్

''ఈ తుగ్లక్ చర్యల ఫలితమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారులకు అదనపు చట్ట భద్రత కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ట్రిబ్యునల్. పీపీఏల విషయంలో కక్షతో వ్యవహరించడం సరికాదని నేను హితవు చెప్పాను. కేంద్రమూ అనేకసార్లు హెచ్చరించింది.'' 

''చివరికి జపాన్ కూడా భారత ప్రభుత్వానికి ఘాటులేఖ రాసింది. అయినా నేను మారను అంటూ మొండిగా వెళ్ళారు. ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టించుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు వస్తుందో లేదో మరి!'' అంటే చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. 

click me!