అమరావతి ఉద్యమంలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. రాజధాని కోసం పోరాడుతున్న ఓ రైతు హటాత్తుగా గుండెపోటుకు గురయి ప్రాణాలు వదిలాడు.
రాజధాని: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు చేపడుతున్న ఉద్యమంలో మరో విషాదం చోటుచేసుకుంది. అమరావతి నిర్మాణం కోసం స్వచ్చదంగా భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన ఓ రైతు ప్రస్తుత పరిస్థితులు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి(శనివారం) క్రితమే గుండెపోటుకు గురయిన అతడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుకు గురై మృతి చెందారు. మృతుడు రాజధాని నిర్మాణానికి అర ఎకరం భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని కుటుంబసభ్యులు తెలిపారు.
undefined
ఈ క్రమంలోనే తోటి రైతులతో కలిసి రాజధానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ అతడు గుండెపోటుకు గురయి ప్రాణాలు కోల్పోయాడు. గోపాలరావు భౌతిక కాయాన్ని రైతు సంఘాల ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
AP Capital Crisis : అందర్నీ ఒక్కసారే కాల్చి, పూడ్చి పెట్టండి...పోలీసులపై రైతుల ఆగ్రహం
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో తీవ్ర మనోవేదనతో ఇప్పటికూ పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలుకు చెందిన పాలకాయల మాధవ అనే 60 ఏళ్ల రైతు గత బుధవారం గుండెపోటుతో మరణించాడు.
ల్యాండ్‌పూలింగ్ విధానంలో ఆయన రాజధానికి అర ఎకరం పొలం ఇచ్చాడు. ఈ క్రమంలో రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకోవడంతో ఆయన తోటి రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నాడు. ఇటీవల తీవ్ర మనస్తాపానికి గురైన మాధవ మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో బుధవారం గుండెపోటుకు లోనై మరణించారు. దీంతో ఐనవోలులో విషాద వాతావరణం నెలకొంది.
రాజధాని ప్రాంతం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు అద్దేపల్లి కృపానందం (68) కూడా బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు.
read more అమరావతి పోరు: తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ
సీఎం జగన్ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఆయన తనకున్న 0.50 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చి మరణించాడు.