సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు: నలుగురు దుర్మరణం

Published : Oct 16, 2020, 07:13 AM IST
సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు: నలుగురు దుర్మరణం

సారాంశం

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు మేజర్ కాలువలోకి దూసుకుని వెళ్లడంతో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందినవారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తంగేడుమల్లి మేజర్ కాలువలోకి ఓ కారు దూసుకుని వెళ్లింిద. 

ఆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు మృతులను ప్రకాశం జిల్లా పామర్రుకు చెందినవారిగా గుర్తించారు. వారు హైదరాబాదు నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా అద్దంకి - నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై ఆ ప్రమాదం జరిగింది. 

ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా