ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.
అమరావతి: యువ సీఎం జగన్ విధానాలు దేశంలో ఐదుగురు సీఎంలు అనుసరిస్తున్నారని ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి తెలిపారు. కాబట్టి ఆయనను విమర్శించే ముందు ప్రతిపక్ష నాయకులు ఓ సారి ఆలోచించాలని అన్నారు. కేవలం ప్రాంతీయపార్టీల సీఎంలే కాదు జాతీయపార్టీ అయిన బీజెపీ పాలిత రాష్ట్రాలలో కూడా జగన్ విధానాలు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర బడ్జెట్ లో 12% అంటే రూ.28866.23 కోట్లు వ్యవసాయానికి కేటాయించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ప్రశంసిచారు. రైతులకు పరిహారం రూ.7 లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు. ధాన్యం సేకరణలో ఖరీఫ్ లోనే 50% సేకరించామని.... అన్ని పంటలకు గతంలోకంటే అధికంగా సేకరణ జరిగిందని తెలిపారు.
read more నరసరావుపేటలో ఉద్రిక్తత: ఎంపీటీసీ అభ్యర్ధి నామినేషన్ చించేసిన వైసీపీ శ్రేణులు
రైతుల విషయంలో వెంటనే స్పందిస్తున్న ఏకైక సీఎం జగనేనని కొనియాడారు. మార్చి 5 వరకూ రైతులకు చెల్లింపులు పూర్తిచేస్తామని అన్నారు. జగన్ పాలనలో చేసిన మంచి పనులు చంద్రబాబు పాలనలోనూ జరగలేదంటూ గత టిడిపి పాలనను విమర్శించారు.
స్ధానిక ఎన్నికలకు వెళ్ళడానికి చంద్రబాబు భయపడ్డారని అన్నారు. స్ధానికసంస్థల ఎన్నికలలో రైతులు, కార్మికులే కీలకమని... వారంతా వైసిపినే గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు.