చోరీ కేసుతో మనస్తాపం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Published : May 25, 2020, 11:05 AM ISTUpdated : May 25, 2020, 11:24 AM IST
చోరీ కేసుతో మనస్తాపం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

సారాంశం

గుంటూరు జిల్లాలోని బాపట్ల మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సామూహిక అత్మహత్యలు చేసుకున్నారు. చోరీ కేసుతో మనస్తాపానికి గురై దంపతులతో పాటు వారి కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుం్బానికి చెందన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెం గ్రామంలో ఆ సంఘటన చోటు చేసుకుంది.

మృతులను విరారెడ్డి, రమణ దంపతులుగా, వారి కూతురు పోలేరగా గుర్తించారు. వారిపై దొంగతనం కేసు మోపినట్లు తెలుస్తోంది. దాంతో వారు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. విషాహారం తిని వారు ఆత్మహత్య చేసుకున్నారు. 

సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, వారి ఆత్మహత్యకు గల అసలు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పక్క పొలంలో మోటారు దొంగతనం చేసినట్లు వారిపై కేసు నమోదైంది. వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా