గుంటూరు జిల్లాలో మహిళ దారుణ హత్య: శవం పక్కన అపస్మారక స్థితిలో యువకుడు

Published : May 09, 2020, 07:09 AM IST
గుంటూరు జిల్లాలో మహిళ దారుణ హత్య: శవం పక్కన అపస్మారక స్థితిలో యువకుడు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె శవం పక్కనే ఓ యువకుడు పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం 5వ మైలు వద్ద ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది.  ఆమెను ఏటుకూరు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. శ్రీలక్ష్మి 5మైలు వద్ద  పోలంలో దారుణంగా హత్యకు గురైంది. 

శ్రీలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది పొలంలో శ్రీలక్ష్మీ మృతదేహం ప్రక్కన కొండేపాడు గ్రామానికి చెందినయువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతను పురుగుల మందు చేవించి అపస్మారక స్దితిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అతన్ని పోలీసులు గుంటూరు జిజిహెచ్ కి తరలించారు.  

అతనే మహిళను హత్య చేసి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసు విచారణ జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా