పెళ్లిల్లు, పెళ్లాలపై కాదు... సమస్యల పరిష్కారంపై మాట్లాడాలి...: జగన్ కు ఉండవల్లి చురకలు

By Arun Kumar P  |  First Published Nov 14, 2019, 2:20 PM IST

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టాలన్న నిర్ణయం వివాదానికి దారితీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్దంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.   


రాజమండ్రి: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన తదితర అంశాలపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లు ప్రతిపక్షాలుగా సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నారని మాజీ ఎంపి. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసించారు. అలాంటివారిపై అధికార వైసిపి నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని సూచించారు. 

గత  ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించ అధికారాన్ని చేజిక్కించుకున్న వైసిపి ప్రజల నమ్మకాన్ని  నిలబెట్టాలని... అందుకోసం ప్రతిపక్షాల ప్రశ్నలు,  ఆరోపణలకు సరైన  వివరణ ఇవ్వాలని సూచించారు. అంతేగాని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడొద్దని అన్నారు. 

Latest Videos

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైసిపి ఎంపీలు విభజన జరిగిన తీరుపై చర్చకు నోటీసులు ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడుగతూనే ఉంటామని  సిఎం చెబుతున్నారని... కేంద్రాన్ని ఎంతకాలం అడిగినా ప్రత్యేకహోదా ఇవ్వరని ఉండవల్లి పేర్కొన్నారు.   

video news : నలభై మంది చనిపోతే...ఐదుగురికే ఆర్థికసాయం...

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంకు బదులు ఇంగ్లీష్ ను ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని...వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సూచించారు. అంతేగానీ ఎన్ని పెళ్లిల్లు, ఎంత మంది  పెళ్లాలు, మట్టి కొట్టుకు పోతావనే విమర్శలు తగవని అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్షాలకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో కూడా తెలుగు తప్పనిసరి అని నిబంధన పెట్టాలన్నారు. అధికార పార్టీ నాయకులు విమర్శలతో విరుచుకుపడకుండా సంయమనం పాటించాలని... ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ పై శిక్షణ ఇవ్వడం, పాఠశాలలో ఇంగ్లిష్ తప్పనిసరి చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఉండవల్లి సూచించారు.

read more  పవన్ కళ్యాణ్ కు తాళి, ఆలి విలువ తెలియదు...: వైసిపి నేత ఘాటు వ్యాఖ్యలు 

ఇలా ప్రతిపక్షాలన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనపై విమర్శలు ఎక్కుపెడుతున్నా జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కితగ్గడం లేదు. దీని అమలుపై మరింత  వేగాన్ని పెంచిన ప్రభత్వం... ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రత్యేక అధికారిని నియమించింది. ఐఏఎస్ అధికారి వెట్రిసిల్వికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది.  

అంతకు ముందే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో బోధనకు కేబినెట్‌ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతుల వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టుగా, మిగిలిన తరగతుల్లో ఒక్కొక్క ఏడాదీ, ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన జరగనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధనకోసం తల్లిదండ్రులనుంచి, ఉపాధ్యాయులు, ఇతర మేధావులనుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ వచ్చిందని మంత్రివర్గం తెలిపింది. తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం కోరుకుంటున్నారని, దీనివల్లే ప్రై వేటు విద్యాసంస్థల్లో ఏటా ఎన్‌రోల్‌మెంట్‌ పెరుగుతోందని కేబినెట్ వెల్లడించింది.

 

click me!