చంద్రబాబుపై చెప్పులు వేయమని చెప్పిందే ఆయన...: మాజీ మంత్రి జవహర్

By Arun Kumar PFirst Published Feb 27, 2020, 6:30 PM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆయనను విశాఖ విమానాశ్రయం నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై మాజీ మంత్రి జవహర్ ఫైర్ అయ్యారు. 

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్పీజీ సెక్యూరిటీలో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి భద్రత కల్పించడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి మండిపడ్డారు. ఒక పక్క తన శ్రేణులతో వైజాగ్ లో ఏదో జరిగిపోతుందని సామాన్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ మరోపక్క ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తూ, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైజాక్ కు చంద్రబాబు నాయుడు వ్యతిరేకం అనే విధంగా ఒక అభూత కల్పన సృష్టించి ఆయనపై దాడి చేయించడాన్ని ఖండిస్తున్నానని జవహర్ తెలిపారు. 

రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో విఫలమైన మహిళా హోంమంత్రి హోంమంత్రి  మేకతోటి సుచరిత రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైజాగ్ లో చంద్రబాబు వాహనంపై దాడిచేసిన వారిని  గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. వైసిపి ప్రభుత్వ నిర్ణయాల వల్లే రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిందని మాజీ మంత్రి మండిపడ్డారు. 

read more  బాబు విశాఖ టూర్: టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

ప్రతిపక్ష నేత, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఈరోజు జగన్ ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోవడం దారుణమన్నారు. విశాఖలో ఇవాళ జరిగిన సంఘటనలు పోలీసు ప్రేరేపితమేనని అన్నారు. చంద్రబాబు మీద దాడి చేసే విధంగా పోలీసులంతా  వైసిపికి సహకరించారని ఆరోపించారు.

 విమానాశ్రయం నుంచి వైజాగ్ మెయిన్ రోడ్డుకు రావడానికి దాదాపు 45 నిమిషాలు ఒక ప్రతిపక్ష ప్రధాన నాయకుడికి పట్టిందంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? అని ప్రశ్నించారు.  శాంతి భద్రతల విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఎంత ఉందో ప్రత్యక్షంగా బయటపడిందని అన్నారు. 

read more  చంద్రబాబుకు షాక్: విశాఖ పర్యటనకు గంటా శ్రీనివాస రావు డుమ్మా

చంద్రబాబు దాడి చేయమని కార్యకర్తలను ప్రేరేపించింది వైసీపీ నేతలేనని ఆరోపించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా స్వయంగా చంద్రబాబు గారిపై రాళ్లు, చెప్పులు వేయమని కార్యకర్తలను రెచ్చగొట్టారని అన్నారు. ఇలాంటి ఘటనలతో ప్రశాంతమైన విశాఖ నగరంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

click me!