ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంటిపెద్దలా, జగన్ ఇంటి దొంగలా: జవహర్ ఎద్దేవా

By Arun Kumar P  |  First Published Mar 24, 2020, 8:37 PM IST

ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, వైఎస్ జగన్ ల పాలనను పోలుస్తూ మాజీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


గుంటూరు: అర్ధసత్యాలు, అసత్యాలతో ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని  మాజీ మంత్రి జవవహర్ ఆరోపించారు. డిసెంబర్‍లో వైరస్ బయట పడితే ఇవాళ్టి వరకు ముఖ్యమంత్రి మేల్కొలేదని అన్నారు. లాక్ డౌన్ పేరుతో ప్రజలపై లాఠీ ఛార్జ్ సరికాదన్నారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రజలను బలి చేస్తారా? అని ప్రశ్నించారు. 

పది నెలల్లోనే జగన్ అనుభవరాహిత్యం బయటపడిందని అన్నారు. ఈ విపత్కర సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఇంటి పెద్దలాగా వుంటే జగన్ ఇంటి దొంగలా వ్యవహరించారని మండిపడ్డారు.  ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోతున్నారని అన్నారు. కరోనాపై ప్రజలను చైతన్య పరచడంలో, ఆరోగ్యాన్ని కాపాడటంలో జగన్ విఫలమయ్యాడని జవహన్ అన్నారు.

Latest Videos

undefined

''డిసెంబర్ లో కరోనా వైరస్ ప్రబలింది. మార్చ్ 11 న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరినాని ప్రపంచ విపత్తు గా ప్రకటించింది. మార్చ్ 15 న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కరోనా పెద్ద విషయం కాదు ప్యానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు అన్నారు'' అని గుర్తుచేశారు.

''వారంలోనే మనస్సు మార్చుకొని కరోనా తో పెను ప్రమాదం పొంచి ఉంది అంటూ మూడు నెలలు దాచి పెట్టిన నిజాలు కక్కారు.14 వేల మంది విదేశాల నుండి వచ్చి రాష్ట్రంలో ఉన్నారు అని బాంబు పేల్చారు. మూడు నెలలు మొద్దు నిద్రపోయారా?''

''లేక స్థానిక సంస్థలను కైవసం చేసుకోవడానికి ప్రజలు ప్రాణాలు పోతే ఏంటి అని నిద్ర నటించారా? ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న నివారణ చర్యల ఫోటోలు ట్యాగ్ చేస్తూ వైకాపా నేతలు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు అంటేనే మీరు ఏ మాత్రం చర్యలు తీసుకున్నారో అర్ధం అవుతుంది'' అంటూ జగన్ ప్రభుత్వంపై జవహర్ విరుచుకుపడ్డారు. 
 

click me!