గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Published : Jul 02, 2020, 09:29 AM IST
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. కంటైనర్ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. కంటైనర్, కారు ఢీకొట్టడంతో గురువారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు.  

జాతీయ రహదారిపై వెళ్తున్న కారును కంటైనర్ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా