సీఎం జగన్‌కు సంబంధించి ఈ రెండు ఫొటోలే వాడాలి: ప్రభుత్వం ఆదేశం

By Arun Kumar PFirst Published Nov 12, 2019, 10:09 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో వాడాల్సిన తన ఫోటోల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఓ ముఖ్యమైన ఆదేశం జారీ చేశారు. అదేంటంటే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో తన ఫొటోలకు సంబంధించి ఓ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రకటన వచ్చినా, ఏ వార్త రాసినా అందులో తనకు సంబంధించిన ఈ రెండు ఫొటోలు మాత్రమే వాడాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ప్రభుత్వం కార్యక్రమాల్లో వాడాల్సిన మొదటి ఫోటో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార మాసపత్రిక కవర్ పేజీ మీద ప్రచురించిన   ఫొటో బ్లాక్ అండ్ వైట్‌ ది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున చేపట్టే కార్యక్రమాల్లో జగన్ ఫొటోలతో కూడిన బ్యానర్లను ప్రభుత్వం తయార చేయిస్తోంది.

video:ప్రభుత్వంతో భాగస్వామ్యం.... మంత్రి మేకపాటితో హెచ్‌సీఎల్

ప్రభుత్వం కార్యక్రమాల్లో సీఎం జగన్  పోటోలను ఒక్కో జిల్లాలో ఒక్కో విధమైనవి వాడుతూ ఆ బ్యానర్లపై ముద్రిస్తున్నారు. దీని వల్ల కొన్ని పాత ఫొటోలు బ్యానర్ల మీద కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇకపై ప్రభుత్వం తరఫున తన కొత్త ఫొటోలు మాత్రమే వాడాలని జగన్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
 

click me!