ఇసుక కొరతకు కారణం వరదలు కాదు... అసమర్థ పాలనే...: కన్నా లక్ష్మీనారాయణ

By Arun Kumar PFirst Published Nov 4, 2019, 3:26 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరతకు అధికార పార్టీ అసమర్థ పాలనే  కారణమని బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే  వరదలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

విజయవాడ:  వర్షాలు, వరదల పేరు చెప్పి ఇసుక సమస్యపై ప్రభుత్వం చేతులెత్తేస్తోందని...ఇందుకోసమేనా వీరు అధికారంలోకి వచ్చింది అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ద్వజమెత్తారు. వరదల  వల్లే ఇసుక కొరత ఏర్పడిందనడం ఈ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శమని ఆయన వివమర్శించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇసుక తీయవచ్చన్న విషయం కూడా అధికార పార్టీ నాయకులు తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిజెపి నేతలపై దాడులు పెరిగాయని కన్నా ఆరోపించారు. కేవలం ఐదు నెలల వైఎస్సార్‌సిపి పాలనతో ప్రజలు భయాందోలనకు గురవుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బిజెపి నాయకులపై ‌వైసిపి దాడులకు దిగి భయపెడితే జంకేవారు ఎవ్వరూ లేరన్నారు.

కేవలం నాలుగు నెలల్లో ప్రభుత్వానికి పోలీసులను ఉపయోగించిన ప్రజా పోరాటాలను అణచివేసే దుస్థితి వచ్చిందన్నారు. క్షేత్రస్ధాయిలో ఈ నాలుగు నెలల్లో అవినితి జరుగుతుంటే జగన్ కు తెలియడం లేదా..? అని ప్రశ్నించారు.  ప్రభుత్వ అధికార యంత్రాంగం మీద సీఎం జగన్ కు పట్టుపోయిందన్నారు.

read more ఇసుక తాత్కాలిక సమస్య మాత్రమే...ఈ నెలమొత్తం ఇలాగే...: సీఎం జగన్

తమపై దాడులు జరిపినా భయపడేది లేదని... ప్రజా సమస్యలపై నిత్యం బిజెపి పోరాడుతూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రజల సమస్యలను గుర్తించి వారి పక్షాన నిలిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు.  

ఇక ఇసుక కొరతపై స్పందిస్తూ వరద నీరు ఇసుక తవ్వకాలకు ఆటంకం కలిగిస్తే  గ్లెడ్జింగ్ ద్వారా ఇసుక తీయొచ్చని తెలియదా...అని ప్రశ్నించారు. ఈ ఇసుక సమస్యతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు కూడా తమరి సంస్ధలో పనిచెసేవాళ్ళకి, ఉద్యోగులకు  జీతాలిచ్చినట్లే ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ‌ కార్మికులకు జూన్ నెల నుంచి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలు  పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వైసిపి తరుపున మాట్లాడే నేతలంతా  దమ్ముంటే వారి నాయకుడి చేత ఇసుక ఇప్పించే ప్రయత్నం చేయాలన్నారు. అంతేగానీ ప్రజా‌సమస్యలపై పోరాడే వారిని విమర్శించి పక్కదారి పట్టించకండని సూచించారు. 

read more  #JanaSenaLongMarch టీడీపీ అధ్యక్షుడిగా పవన్: మంత్రి అవంతి సెటైర్లు

ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీని  గద్దెదించారు. అలా తమరు అప్రజాస్వామికంగా పాలిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కన్నా హెచ్చరించారు. 

 

click me!