ఇసుక తాత్కాలిక సమస్య మాత్రమే...ఈ నెలమొత్తం ఇలాగే...: సీఎం జగన్

By Arun Kumar P  |  First Published Nov 4, 2019, 2:39 PM IST

రాష్ట్రంలో ఇసుక  కొరత నేపథ్యంలో  భారీ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులతో ఈ సమస్య పరిష్కారానికై సమీక్షా సమావేశం నిర్వహించారు. 


అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత అన్నది తాత్కాలిక సమస్యేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు  కొనసాగుతుండటంతో ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాలశాఖ అధికారులదో ముఖ్యమంత్రి సమావేశమై ఇసుక కొరత, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు.  
90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందని...దీంతో జలాశయాలు నిండుకుండల్లా మారడమే కాదు నదులు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 
265కి పైగా రీచుల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు.మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలో మునిగి వున్నాయి, వాటిలో కూడా తవ్వకాలు ప్రారంభమైతే ఇసుక పుష్కలంగా లభిస్తుందని సీఎం తెలిపారు.

వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తూ రీచ్ ల వద్ద ఇసుక తీయడం కష్టంగా ఉందన్నారు. లారీలు, ట్రాక్టర్లే కాదు చిన్న చిన్న వాహనాలు కూడా   వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 
90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి చివరకు పెన్నా నదిలో కూడా వరద వస్తోందని సీఎం పేర్కోన్నారు. 

Latest Videos

video News:విశాఖను ముంచెత్తిన జనసైన్యం.. ఏరియల్ వ్యూ


ఇలా నీళ్లు రావడం రైతులకు, పంటలకు, భూగర్భజలాలకు మంచిదేనని అన్నారు. దీని వల్ల రైతులకు మేలు జరిగినా ఇసుక కొరతను సృష్టించింది. నిరంతరం వరద వల్ల ఇసుక సమస్య వస్తోందన్నారు. 

గత ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా నడిచిందని విమర్శించారు. పొక్లెయిన్‌లతో, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేశారని ఆరోపించారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ తమ ప్రభుత్వం ఇప్పుడు మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు చేపట్టినట్లు జగన్ వెల్లడించారు.

భారీ వర్షాలతో జలాశయాలన్నీ నిండుగా మారాయని... ప్రకాశం బ్యారేజీ వద్దకు వెళ్లిచూసినా ఎప్పుడూ గేట్లు ఎత్తే ఉంటున్నాయన్నారు. దిగువకు వరదనీరు నిత్యం ప్రవహిస్తూనే ఉందన్నారు. 

ఈ  వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గి నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తిగా ఇసుక సమస్య తీరుతుందని భావిస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో పేరుకు ఇసుక ఫ్రీ అని చెప్పారని..కానీ దాని పేరుతో ఓ మాఫియా నడిపారని ఆరోపించారు. ఇప్పుడు మేం చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు.

సొంతపుత్రుడితో డైట్ దీక్ష....దత్తపుత్రుడితో రాంగ్ మార్చ్...: చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే సెటైర్లు
ప్రజలకు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కిలోమీటర్‌కు రూ.4.90 లకు ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నామని తెలిపారు. వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని..ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్‌యార్డులు కూడా ఇస్తామన్నారు. ఇసుక అన్నది తాత్కాలిక సమస్య మాత్రమేనని జగన్ పేర్కొన్నారు.  


 

click me!