కేంద్రానికి సమాచారమే లేదు... వైసిపి ప్రభుత్వ ఆదేశాలు చెల్లవు...: మాజీ మంత్రి కామినేని

By Arun Kumar P  |  First Published Feb 3, 2020, 6:20 PM IST

మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలుచేయడానికి సిద్దమైన జగన్ సర్కార్ ఒక్కోటిగా కార్యాలయాల తరలింపు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకోనుందని మాజీ మంత్రి, బిజెపి నాయకులు కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. 


అమరావతి: రాష్ట్ర రాజధానిని మార్చే అధికారం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు లేదని బిజెపి నాయకులు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. ఇప్పటికే సచివాలయంలోని కొన్ని కార్యాలయాలను మార్చేందుకు అధికారికంగా ఆదేశాలు జారీ అయినా అవేవి చెల్లవన్నారు. అసలు ఎందుకు మార్చాల్సివస్తుందో స్పష్టమైన వివరణ కేంద్ర ప్రభుత్వానికి వైసిపి  ప్రభుత్వం ఇవ్వాల్సి వుంటుందన్నారు. అయితే జగన్ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా   కేంద్రం అడుగుతుందన్నారు. 

ఈ ప్రభుత్వ పాలన నచ్చక కొత్త కంపనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోగా ఉన్న కంపనీలు తమ మెళ్లగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయని అన్నారు. చాలా కంపనీలు ఇప్పటికే రాష్ట్రం నుండి వెళ్ళిపోయాయని అన్నారు. 

Latest Videos

undefined

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో భయానక వాతావరణం నెలకొని వుందన్నారు కామినేని. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరుతో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు అనుమానముంటే విచారణ జరుపుకోవాలి కానీ ఇక్కడ అవినీతి జరిగిందన్న సాకుతో రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. 

read more  ''కరోనా వైరస్ లాగే ఏపిలో జగరోనా వైరస్... భయాందోళనలో ప్రజలు''

రాష్ట్ర ప్రజలెవ్వరు రాజధాని మార్పు కోరుకోవడం లేదన్నారు. విశాఖ ప్రజలు కూడా రాజధాని కావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అందరూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మాత్రమే కోరుకుంటున్నారని... పరిపాలన మాత్రం ఒక్కచోటి నుండే జరగాలని అనుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లడించారు.

గతంలో రాజధానిగా అమరావతి వుండాలని ఏకగ్రీవంగా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి రాగానే జగన్ రాజధాని విషయంలో మాట మార్చారని... గత ఆరునెలల్లో అన్ని రద్దులు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆరోపించారు. అర్ధరాత్రి కార్యాలయాలు తరలింపు చేస్తున్నారని.. ఈ విషయంలో మరోసారి  న్యాయస్థానం ముందు దోషిగా జగన్ నిలుచోక తప్పదని కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. 

read more  వైసిపి ఎంపీపై దాడికి టిడిపి విద్యార్థి విభాగం ప్రయత్నం... 20మందిపై కేసు
 

click me!