తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రయాణికుల్ని ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రయాణికుల్ని ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరులోని లాం గ్రామం సమీపంలో ఓ ఆటో చెట్టుని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా 6గురు గాయపడ్డారు. ప్రయాణికులంతా లాం గ్రామానికి చెందినవారు. మోతడకకు కూలి పని కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని వెంటనే గుంటూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి.
టీజర్ కీచక బుద్ధి.. ఇద్దరు ఐదవ తరగతి బాలికలతో..
డ్రైవర్ పక్కనే కూర్చున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ ని ఆటో స్టీరింగ్ వద్ద ఉంచాడు. ఆటో వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అతడి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ కోసం అతడు స్టీరింగ్ వద్ద చేయి పెట్టాడు. అతడి చేయి డ్రెవర్ కు అడ్డు తగలడంతో ఆటో అదుపు తప్పింది. క్షణాల్లో ఆటో పక్కనే ఉన్న చెట్టుని ఢీ కొట్టడంతో ఘోరం జరిగింది.
ఈ ఘటనతో సెల్ ఫోన్ ఉపయోగించిన వ్యక్తి పొరపాటుతో పాటు, డ్రైవర్ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పల్లెటూర్లలో ఆటో డ్రెవర్లు అధికమొత్తంలో ప్రయాణికుల్ని ఎక్కించుకుంటారు. కనీసం ఆటోని సురక్షితంగా నడిపేందుకు వీలులేనివిధంగా ప్రయాణికుల్ని ఎక్కించుకుంటారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.