ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదం నేపథ్యంలో అమరావతి రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదం నేపథ్యంలో అమరావతి రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. నిడమర్రు, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాల్లో ప్రాంతాల్లో రైతులు అమరావతిలోని ఏపీ రాజధాని ఉండాలని ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా తాడికొండలో రైతులకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తాడికొండ నుంచి మందడం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కానీ అనుమతి లేదని పోలీసులు బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. తుళ్ళూరులో జరుగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా ఈ బైక్ ర్యాలీ చేపట్టారు.
undefined
ఇక మందడంలో రైతులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు ఉంచారు. రోడ్డుపైనే పశువుల్ని కట్టేసి నిరసన తెలియజేశారు. మరికొందరు రైతులు పోలీసులనే బిక్షం అడిగి నిరసన తెలియజేశారు. సచివాయలం వెళ్లే ఉద్యోగుల్ని అడ్డుకుని రైతులు నిరసన తెలిపారు.
ఏపీ రాజధాని అంశం వివాదంగా మారుతుండడంతో అమరావతి స్థానికంగా ఉన్న వైసిపి నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. వైజాగ్, కర్నూల్ ప్రాంత ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఆ ప్రాంత రైతులు దాదాపు 33 వేల ఎకరాలని ప్రభుత్వానికి ఇచ్చారు. డీఎంఈకి ప్రతిఫలంగా ప్రభుత్వం రైతులకు కొన్ని ప్రయోజనాలు ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. వైసిపి అధికారంలోకి వచ్చింది. సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.