వైన్, మైన్, శాండ్, ల్యాండ్...వైసిపి అవినీతి లేనిదెక్కడ...: కళా వెంకట్రావు

By Arun Kumar PFirst Published Feb 18, 2020, 4:46 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న ప్రజా చైతన్య యాత్ర ద్వారా ఏపిలో సాగుతున్న వైసిపి అసమర్థ పాలన గురించి ప్రజలకు వివరిస్తామని టిడిపి ఏపి అధ్యక్షులు కళా వెంకట్రావు తెలిపారు.

ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమవుతుందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు తెలిపారు.     ప్రజా చైతన్య యాత్ర కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. 45 రోజులపాటు ఈ ప్రజా చైతన్య యాత్ర జరుగుతుందని  ప్రకటించారు. 

ప్రకాశం జిల్లాలో ఈ చైతన్య యాత్రను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని అన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా  ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. 

వైసీపీ 9 నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచిపోయిందని ఎద్దేవాచేశారు. వైసీపీ నియంత్రృత్వ పోకడలను ప్రజా క్షేత్రంలో ఎండకడతామని అన్నారు.    ఈ ప్రభుత్వం అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని... తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని కులాల, మతాల వారీగా ముక్కలు చేస్తోందని మండిపడ్డారు. 

read more   హైదరాబాద్ తరహాలో... మేం కేంద్రాన్ని కోరిందదే...: ఏపి హోంమంత్రి

ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పాలన కారణంగా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేస్తూ మోయలేని భారాలను ప్రజలపై మోపుతున్నారని  అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రజలనుండి బలవంతంగా జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

 ఆర్టీసీ చార్జీలు రూ. 750 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ. 1300 కోట్లు, పెట్రోల్, డీజిల్ చార్జీలు రూ.500 కోట్లు, మద్యంపై రూ. 1800 కోట్లు పెంచారని అన్నారు. సారా దుకాణాల్లో ఎక్సైజ్ స్టాఫ్ తో పాటు వైసీపీ కార్యకర్తలను పెట్టారని మండిపడ్డారు. 

నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచేశారని అన్నారు. సీఎం జగన్ మాట తప్పడమే కాదు మడమ తిప్పారని అన్నారు. ఇప్పటికే అర్హుల పింఛన్లు తొలగించి 18 లక్షల మందికి అన్యాయం చేశారన్నారు. ఆటో కార్మికులకు ఆదుకుంటామని జగన్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ఏమైనట్టు? అని ప్రశ్నించారు.

అమ్మ ఒడి కింద 80 లక్షల మంది అర్హులుండగా దాన్ని 40 లక్షలకు కుదించారని ఆరోపించారు. జే ట్యాక్స్ వచ్చే చోటికి ఎస్టీ, ఎస్టీ, బీసీ నిధులు మళ్లిస్తున్నారని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తానన్న జగన్ మాట తప్పారని అన్నారు. 

read more  జీఎంసీ కార్యాలయంలో ఏసిబి దాడులు... పట్టుబడిన ఇద్దరు అధికారులు

పేదలకు ఇస్తానని చెప్పిన సన్న బియ్యం ఎక్కడ?అని నిలదీశారు. వైన్, మైన్, శాండ్, ల్యాండ్ ... ఈ ప్రభుత్వం దేనినీ వదలట్లేదన్నారు. విశాఖలో మఠం ఆస్తులను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని...అక్కడి మైనారిటీ ఆస్తులపై వైసీపీ నేతలు కన్నేశారని ఆరోపించారు.

అన్ని విభాగాల్లో జే ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దలు అడుగుతున్న పర్సంటేజీలకు భయపడి పారిశ్రామిక వేత్తలు రాష్ట్రాన్ని  వదిలి పారిపోతున్నారని  అన్నారు. వైసీపీ అసమర్థ పాలనపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? పోలీసులను చేతిలో పెట్టుకుని ఎన్నాళ్లు పాలిస్తారు? అంటూ కళా వెంకట్రావు వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  
 

click me!