హైదరాబాద్ తరహాలో... మేం కేంద్రాన్ని కోరిందదే...: ఏపి హోంమంత్రి

By Arun Kumar P  |  First Published Feb 18, 2020, 4:17 PM IST

ఏపిలో  పోలీస్ శాఖను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. 


అమరావతి: నవ్యాంద్రలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. అందులోభాగంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హోం శాఖ కు అనుబందంగా ఉన్న అన్ని విభాగాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

అయితే రాష్ట్రంలో సరయిన పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లేదని... అనంతపురంలో ఉన్న  పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సౌకర్యవంతంగా లేదన్నారు. కాబట్టి విభజన చట్టం ప్రకారం హైద్రాబాద్ తరహాలో సౌకర్యవంతమైన ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని... అందుకు సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. 

Latest Videos

read more  జీఎంసీ కార్యాలయంలో ఏసిబి దాడులు... పట్టుబడిన ఇద్దరు అధికారులు

డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... దిశాచట్టం కేంద్ర ఆమోదానికి ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. దిశా యాప్ కు 48 గంటల్లో 2000 టెస్ట్ కాల్స్ వచ్చాయని తెలిపారు. దిశ చట్టానికి సంబంధించిన కేసుల్లో పోలీస్ రెస్పాన్స్ పై  ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దిశా చట్టానికి కేంద్ర ఆమోదం లభిస్తే మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. 

ఇక సోషల్ మీడియాలో విఆర్ లో ఉన్న వారికి జీతాలు లేవు అంటూ తప్పుడు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయని... అవన్నీ వదంతులేనని అన్నారు. కాల్ మ‌నీ కేసులు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఫేక్ కేసులు పెడితే పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని డిజిపి హెచ్చరించారు. 

click me!