జీఎంసీ కార్యాలయంలో ఏసిబి దాడులు... పట్టుబడిన ఇద్దరు అధికారులు

By Arun Kumar P  |  First Published Feb 18, 2020, 3:31 PM IST

గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో ఇద్దరు అధికారులు భారీమొత్తంలొో నగదుతో పట్టుబడ్డారు.   


గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఔట్ సోర్స్ ఎంప్లాయ్ వద్ద రూ.55వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టౌన్ ప్లానర్ వద్ద 25వేలకు పైగా నగదు అధికారులు గుర్తించారు. అలాగే పలు రికార్డులు పరిశీలించిన అధికారులు అనుమానం వున్నవాటిని స్వాధీనం చేసుకున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్్న తనిఖీల్లో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు తెలిపారు. ఈ క్రమంలో నగదుతో పట్టుబడిని ఇద్దరు అధికారులను విచారిస్తున్నట్లు తెలిపారు. వారి వద్ద ఇంత డబ్బు ఎందుకుందన్న దానిపై విచారణ సాగిస్తున్నట్లు  తెలిపారు. 

Latest Videos

అయితే ఈ నగదుకు సంబంధించిన సరయిన వివరాలను అందిస్తే ఉద్యోగులపై ఎలాంటి  చర్యలు వుండవని... లేదంటే వారిపై తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని అన్నారు.

అవినీతిపై పోరు ఉధృతం చేశామని  ఇటీవలే సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అవినీతి అన్న అంశం మీద పోరాటాన్ని అగ్రెసివ్‌గా తీసుకోవాలని...ఎక్కడా అవినీతికి చోటు లేదన్న విషయం కింది స్థాయి అధికారులకు, ప్రజలకు చేరేలా చూడాలని  ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఈ క్రమంలోనే అవినీతిపై పోరుకు రెండు మూడు వారాల్లో ఏసీబీని పెద్ద ఎత్తున రంగంలోకి దించుతున్నట్లు... చాలా చురుగ్గా ఏసీబీ పని చేయనున్నట్లు సీఎం హెచ్చరించారు. 

ఆయన ప్రకటన చేసినప్పటి నుండి  ప్రభుత్వ కార్యాలయాలపై ఏసిబి దాడులు మొదలుపెట్టింది. లంచాలు స్వీకరించే అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తగినవిధంగా చర్యలు తీసుకుంటోంది. ఇలా తాజాగా భారీగా ఏసిబి దాడులు జరుగుతుండగా ఇవాళ జీఎంసీలో తనిఖీలు కొనసాగాయి. 

 

 

click me!