ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నిర్మాణం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను హైకోర్టు సమర్ధించింది. ఈ మేరకు నవయుగ సంస్థ కేసు విషయంలో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంపై మంత్రి అనిల్ స్పందించారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి హైకోర్టు తీర్పు ప్రతిపక్షానికి చెంపపెట్టు వంటిదని... ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విపక్షాలు ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
గోదావరి నదిలో వరద తగ్గిన వెంటనే పనులు మొదలు పెడతామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
పోలవరంలో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దు చేసి... రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో దిగువ కోర్టు విధించిన స్టే ను హైకోర్టు ఇవాళ ఎత్తివేసింది. దీంతో ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
undefined
read more జగన్ ఆస్తుల కేసులో మరో మలుపు...మాజీ ఐఏఎస్ శర్మపై ఇంకో కేసు
ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ మాట్లాడుతూ...పోలవరంలో పవర్ పవర్ ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన నవయుగ సంస్థ స్టే ఆర్డర్ తెచ్చుకుందని గుర్తుచేశారు. దీనిపై గురువారం విచారణ ముగించిన హైకోర్టు గతంలో దిగువ కోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తివేయడంతో పాటు, కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకునేందుకు అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించిందని అన్నారు.
ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్‌కు విలువ ఉండదన్న అడ్వకేట్ జనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అదే విధంగా బ్యాంకు గ్యారంటీలను ఎన్‌క్యాష్ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇన్‌జంక్షన్ ఆర్డర్‌ను కూడా హైకోర్టు పక్కన పెట్టింది. దిగువ కోర్టు తీర్పును కూడా హైకోర్టు తప్పు బట్టింది.
read more రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం: అమరావతిపై నీలినీడలు
నవయుగ సంస్థ సదుద్దేశంతో కోర్టును ఆశ్రయించలేదన్న అడ్వకేట్ జనరల్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. హైకోర్టు తీర్పును స్వాగతించిన మంత్రి గోదావరిలో వరద తగ్గిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని ప్రకటించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.