గుంటూరు జిల్లా నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా పోలీసులు హోంమంత్రికి గౌరవ వందనం సమర్పించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా పోలీసులు హోంమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే విడదల రజనీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెండవది అయిన దిశ పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్ విజయనగరంలో ప్రారంభించారు. స్థానిక పోలీస్ బ్యారక్ గ్రౌండ్‌లో దిశ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. కాగా రాష్ట్రంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ఉంది.
విజయనగరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా గ్రామ సచివాలయాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్‌లు, గ్రామ మహిళా సంరక్షక పోలీస్‌లు, రైతు భరోసా కేంద్రాల గురించి సీఎం మాట్లాడారు.
Also Read:
రాష్ట్రంలో మరో దిశ పోలీస్ స్టేషన్... ప్రారంభోత్సవ సభలో మహిళలకు జగనన్న వరాలు
మహిళా గ్రామ వాలంటీర్ పై వేధింపులు... దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం