75వ రోజుకు చేరిన రాజధాని ఆందోళనలు

By Siva Kodati  |  First Published Mar 1, 2020, 2:55 PM IST

అమరావతి నుంచి రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు చేస్తోన్న ఆందోళన 75వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా ఆదివారం మందడం గ్రామంలో రోడ్లపై బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, రోడ్లు శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. 


అమరావతి నుంచి రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు చేస్తోన్న ఆందోళన 75వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా ఆదివారం మందడం గ్రామంలో రోడ్లపై బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, రోడ్లు శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను చేపట్టారు.

Also Read:అమరావతి పోలీసులను పరుగు పెట్టించిన తెలంగాణ వాసులు

Latest Videos

తుళ్లూరులో సీపీఎం నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య  కుటుంబానికి చెందిన 16 మంది రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే గుంటూరు నుంచి అమరావతి మద్ధతుదారులు సైకిల్‌పై యాత్రగా వచ్చి రైతులకు సంఘీభావం తెలిపారు. 

 

 

రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిలో భాగంగా అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌ను ప్రతిపాదించారు.

Also Read:చిరంజీవి ఇంటి ముట్టడిపై జేఏసీ వివరణ ఇదీ: ఖబడ్దార్ అంటూ మెగా ఫ్యాన్స్

ఇందుకు సంబంధించి రూపొందించిన వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించగా.. మండలిలో మాత్రం జగన్ సర్కార్‌కు చుక్కెదురైంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును కౌన్సిల్ ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. 

 

click me!