జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలుకు రంగం సిద్దం... మార్గదర్శకాలివే

By Arun Kumar P  |  First Published Nov 30, 2019, 2:46 PM IST

వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు రంగం సిద్దమైంది. ఈ పథకాలకు సంబంధించిన అధికారిక  ఉత్తర్వులను విడుదల చేశారు.  


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు రంగం సిద్దమైంది. ఈ రెండు పథకాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ రెండు పథకాలు అమలుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదలచేసిన ఉత్తర్వుల్లో పొందుపర్చింది. 

ఈ రెండు పథకాల వల్ల వెనుకబడిన ఎస్సి, ఎస్టీ, బీసీ, ఈబీసి, కాపు, మైనారిటీ సామాజిక వర్గాలతో పాటు దివ్యాంగులకు పోస్ట్ మెట్రిక్ స్కాలరషిప్ లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ ఆపై స్థాయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి కూడా స్కాలర్ షిప్ లు వర్తింప చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. 

Latest Videos

undefined

వైఎస్సార్ నవశకం పేరిట విద్యార్థులకు ఫీజు రీఎంబర్సుమెంటు కార్డులు జారీ చేయనున్న ప్రభుత్వం తెలిపింది. నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలోకే నగదు జమ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ పథకం అమలుకు బాధ్యత వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

read more జగన్ పాలనపై చెప్పుకోడానికేం లేదు...చెప్పు తీసుకుని కొట్టుకోడం తప్ప: అనురాధ

జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేలు చెల్లించనున్నారు. డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి 20 వేల చొప్పున చెల్లించనున్నారు. అర్హులైన విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలకు రెండు విడతలుగా ఈ నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు. 

ఈ రెండు పథకాలకు 75 శాతం మేర హాజరు తప్పని సరి అంటూ నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు, కరస్పాండెన్స్, దూర విద్య, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు పొందిన వారికి ఈ పథకాలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

read more  రాజ్యాంగం మీద ప్రమాణంచేసి బూతుల పంచాంగమా...?: మంత్రులపై వర్ల రామయ్య ఫైర్

click me!