నిరుపేదలకు ఇళ్ల స్ధలాలను అందించేందుకు ప్రభుత్వానికి చెందిన లిటికేషన్ స్ధలాలను కూడా సేకరించాలని కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఆదేశించారు.
అమరావతి: రాష్ట్రంలో ఉగాది నాటికి 25లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని కలెక్టర్లకు ఏపి చీఫ్ సెక్రటరీ నీలం సహానీ ఆదేశించారు. ఇళ్ళ స్థలాలు, నవశకం అంశాలపై ప్రభుత్వ సీఎస్ సచివాలయం నుండి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భూసేకరణకు తక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు.ఇళ్ళ స్థలాలకై ఆక్రమణల్లో ఉన్న స్థలాలు, అభ్యంతరం లేదని గుర్తించి లబ్దిదారులకు ఇచ్చేందుకు గుర్తించాలని సిఎస్ స్పష్టం చేశారు. అంతే కాకుండా లిటిగేషన్లలో ఉన్న, వినియోగంలో లేకుండా ఉన్న స్థలాలను కూడా గుర్తించాలని చెప్పారు.
undefined
విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇళ్ళ స్థలాలకై అధిక మొత్తంలో భూమిని సేకరించాల్సి ఉందని కావున కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
read more మహిళా, శిశు సంరక్షణకు చర్యలు చేపట్టిండి...:సిఎస్ ఆదేశం
ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడుతూ... ఇళ్ళ స్థలాలు పంపిణీ విషయంలో వీలైనంత వరకూ ప్రభుత్వంపై భూసేకరణ భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
వీలైనంత వరకూ ప్రభుత్వ భూములను, లిటిగేషన్, ఆక్రమణల్లో ఉన్న భూములను గుర్తించాలని చెప్పారు. పట్టణాల్లో సాధ్యమైనంత వరకు జిప్లస్ త్రీ మోడల్ ఇళ్ళ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
read more రివర్స్ టెండరింగ్...చంద్రబాబు, లోకేశ్ ల భారీ దోపిడీకి అడ్డుకట్ట: బొత్సా
ఈసమావేశంలో సీఎస్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సలహాదారు అజయ్ కల్లాం, సాంఘిక,మైనార్టీ సంక్షేమం,గృహ నిర్మాణ శాఖల ముఖ్య కార్యదర్శులు ఆర్పి సిసోడియా, రిజ్వీ, అజయ్ జైన్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.