మహిళా, శిశు సంరక్షణకు చర్యలు చేపట్టిండి...:సిఎస్ ఆదేశం

By Arun Kumar PFirst Published Nov 29, 2019, 5:59 PM IST
Highlights

మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించేందుకు బాలసంజీవని, బాలామృతం వంటి పథకాలను సక్రమంగా అమలు చేయాలని సీఎస్ నీలం సహాని స్పష్టం చేశారు.  

అమరావతి: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారిలో రక్తహీనతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలుపై ఆ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. 

 సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ... మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించేందుకు బాలసంజీవని, బాలామృతం వంటి పథకాలను సక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా విటమిన్ ఎ, ఐఎఫ్ఏ, కాల్షియం మాత్రలు గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా తీసుకునేలా చూడాలని చెప్పారు. 

ఆసుపత్రి ప్రసవాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా మాతా, శిశు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని 77 గిరిజన ప్రాంత మండలాల్లో అమలు చేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  

read more రివర్స్ టెండరింగ్...చంద్రబాబు, లోకేశ్ ల భారీ దోపిడీకి అడ్డుకట్ట: బొత్సా

రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై కూడాఆమె సమీక్షించారు. రాష్ట్రంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలున్నాయి, ఎన్ని అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి, అద్దెలేని భవనాల్లో ఎన్ని కేంద్రాలు నిర్వహించబడుతుందన్న దానిపై సీఎస్ ఆరా తీశారు. 

గర్భీణీలు, బాలింతలకు సంబంధించి అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహనను కలిగించేందుకు ప్రత్యేకంగా కరపత్రాలు, బుక్ లెట్లు ముద్రించి పెద్దఎత్తున ప్రచారం చేయాలని  ఆదేశించారు. 

వైసిపి కుట్రలు... చంద్రబాబు వాహనంపై దాడికి ముందే ప్రణాళిక..: సోమిరెడ్డి

మహిళా శిశు సంక్షేమశాఖకు సంబంధించిన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు గురించి ఈ సమావేశంలో సిఎస్ నీలం సాహ్ని విస్తృతంగా సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ శాఖలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు,పథకాల అమలు తీరును సిఎస్ కు వివరించారు. సమావేశంలో ఆశాఖ సంచాలకురాలు కృతికా శుక్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

click me!