రాష్ట్రంలోని మహిళల రక్షణ, అమ్మాయిలపై లైంగిక వేధింపులను అరికట్టే ఉద్దేశంతో ఏపి సర్కార్ ఇప్పటికే దిశ చట్టాన్ని తీసుకురాగా తాజాగా ఈ దిశగా మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
అమరావతి: ఈనెల 7వ తేదీన రాజమండ్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిచే ప్రారంభించనున్న దిశ పోలీస్ స్టేషన్, ప్రత్యేక యాప్ తదితర ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎం పర్యటనకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్ల గురించి సిఎస్ తెలియజేశారు.
ఫిబ్రవరి 7వ తేదీన రాజమండ్రిలో పర్యటించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్, ఒన్ స్టాప్ సెంటర్లను ప్రారంభించనున్నారని తెలిపారు. తదుపరి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్ (ఎస్ఓపి) ప్రారంభించనున్నట్లు తెలిపారు.
undefined
read more కేంద్రానికి సమాచారమే లేదు... వైసిపి ప్రభుత్వ ఆదేశాలు చెల్లవు...: మాజీ మంత్రి కామినేని
అలాగే దిశ చట్టానికి సంబంధించి పోలీస్, వైద్యారోగ్యం, ఒన్ స్టాప్ కేంద్రాల సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫోరెన్సిక్ సిబ్బంది, పలువురు డాక్టర్లు, విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన కార్యక్రమాలను రాష్ట్ర స్థాయి శాఖలతో పాటు జిల్లా కలెక్టర్ నేతృతంలో జిల్లా స్థాయిలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సక్రమంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.
ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఇందుకు సంబంధించి వివిధ అంశాలపై సిఎస్ నీలం సాహ్ని అధికారులతో సమీక్షించారు.
read more ''కరోనా వైరస్ లాగే ఏపిలో జగరోనా వైరస్... భయాందోళనలో ప్రజలు''
ఈ సమావేశంలో హోం, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు కిషోర్ కుమార్, కె.దమయంతి, సిఐడి పోలీస్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి, దిశ చట్టం పోలీస్ ప్రత్యేక అధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు.