బోటు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలివే..: అధికారులకు సీఎం ఆదేశం

By Arun Kumar P  |  First Published Nov 6, 2019, 7:51 PM IST

ఇటీవల గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగి నిండు ప్రాణాలెన్నింటినో బలితీసుకుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి  ఘటనలు మరోసారి జరక్కుండా చూడాలని సంబంధిత అధికారులు సీఎం ఆదేశించారు.  


అమరావతి:  బోటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి జలవనరులు, టూరిజం, ఇతర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల  గోదావరి నదిలో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసిన ఆయన ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలియజేయాలని అధికారులను ప్రశ్నించారు. 

నదుల్లో బోటు ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. బోటు ప్రమాదాల నివారణ, భద్రతకోసం 8 చోట్ల కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఆయా మండలాల ఎమ్మార్వో ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్స్‌ వుండనున్నాయి.

Latest Videos

ఈ కంట్రోల్‌ రూంలో జలవనరుల శాఖ, పోలీసులు, టూరిజం తదితర విభాగాల నుంచి సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. ప్రతి కంట్రోల్‌ రూంలో కనీసం 13 మంది సిబ్బంది వుండేలా చూస్తామన్నారు. ప్రతి కంట్రోల్‌ రూంలో ముగ్గురు పోలీస్‌ కానిస్టేబుళ్లు తప్పనిసరి వుండేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

read more కారు ఏర్పాటు చేస్తే అమరావతిలో తిరుగుదాం: బొత్సకు అచ్చెన్న సవాల్

నవంబర్‌ 21న 8 కంట్రోల్‌ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనన్నట్ల తెలిపారు. ఇవి కేవలం 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్స్‌ లో బోట్లు ప్రయాణించాల్సిన మార్గాలు, వాటి కదిలకపై నిరంతర సమాచారం వుండాలన్నారు. అలాగే వరద ప్రవాహాలపై సమాచారాన్ని కూడా   కంట్రోల్‌ రూమ్స్‌ పరిగణలోకి తీసుకుని ఆమేరకు బోట్ల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు.

బోట్లలో ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్‌ వినియోగం ఉండకూడదన్నారు. అలాగే సిబ్బందికీ బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. బోట్లకు జీపీఎస్‌ కూడా పెట్టాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా కంట్రోల్‌ రూమ్స్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. 

కంట్రోల్‌ రూమ్స్‌ పరిధిలో బోట్లు, జెట్టీలు ఉండాలన్నారు. బోట్లపై ప్రయాణించేవారికి టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్‌ రూమ్స్‌కే ఇవ్వాలన్నారు. ఈ కంట్రోల్‌ రూమ్‌కు ఎమ్మార్వోనే ఇన్‌ఛార్జి పెట్టాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా కంట్రోల్‌ రూం చూడగలిగితే.. గ్రేడింగ్‌ ప్రకారం వారికి కనీసం 2 నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలని  సూచించారు. బోట్లలో వాకీటాకీలు, జీపీఎస్‌లు తప్పనిసరిగా ఉండాలన్నారు. 

read more  డిజిపికీ సీఎస్ గతే... జగన్ కూడా కాపాడలేరు..: చంద్రబాబు

మరోసారి బోట్లన్నీ తనిఖీచేసిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలన్నారు. ఆపరేటింగ్‌ స్టాండర్ట్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ఉండాలన్నారు. నదిలో ప్రవాహంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని.. కంట్రోల్‌రూంలో ఉండే సిబ్బంది నదిలో ప్రయాణాలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలని సూచించారు.

కంట్రోల్‌ రూమ్స్‌లో సిబ్బందిని రిక్రూట్‌ చేశాఖ వారికి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్స్‌లో ఉంచాల్సిన సిబ్బందిని త్వరగా రిక్రూట్‌ చేయాలని కోరారు. 

ప్రస్తుతం లైసెన్స్‌లు, బోట్లను తనిఖీ చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలియజేశారు. బోట్లలో పనిచేసేవారికి శిక్షణ కూడా ఇవ్వాలని... శిక్షణ ఉన్నవారికే పనిచేయడానికి అనుమతివ్వాలన్నారు.క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని..ఆ తర్వాతనే బోట్లకు అనుమతి ఇవ్వాలన్నారు. ఇందుకోసం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. 
 

click me!