విద్యార్థులకు వందశాతం ఫీజు రియింబర్స్‌మెంట్...: సీఎం జగన్ ప్రకటన

By Arun Kumar P  |  First Published Nov 28, 2019, 10:01 PM IST

ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌తో సీఎం వైయస్‌.జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం విద్యారంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.  


అమరావతి: ఏపిలో చదువుకునే పిల్లలకు పూర్తిస్థాయిలో ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలతోపాటు పేద పిల్లలు చాలామంది  లబ్ధి పొందుతారన్నారు. కేవలం ఫీజు రియింబర్స్‌మెంటే కాకుండా డిగ్రీ, ఆపై కోర్సులు చదువుతున్న వారికి ఏడాదికి రూ.20వేలను వసతి, భోజనం ఖర్చులకోసం ఇవ్వబోతున్నట్లు సీఎం వెల్లడించారు. 

ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌తో సీఎం వైయస్‌.జగన్ సమావేశమయ్యారు. సీఎంతో  జరిగిన  ఈ సమావేశంలో కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్యతో పాటు కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు.

Latest Videos

undefined

వివిధ కోర్సులకు  సంబంధించిన పాఠ్యప్రణాళిక మార్చబోతున్నామని... ఉద్యోగం, ఉపాధి కల్పించేలా పాఠ్యప్రణాళిక రూపొందించబోతున్నట్లు సీఎం తెలిపారు. ఏడాది పాటు అదనంగా అప్రెంటిస్‌ ఇవ్వబోతున్నామని... అందుకనే వీటిని మామూలు డిగ్రీలుగా కాకుండా ఆనర్సు డిగ్రీలుగా పరిగణించాలన్నారు.  ఒక ఏడాది అనుభవంతో కూడిన డిగ్రీకి మంచి విలువ ఉంటుందని  పేర్కొన్నారు.

read more  అమరావతి నిర్మాణంపై రగడ... ఎక్స్‌పర్ట్ కమిటీతో సీఎం జగన్ సమావేశం

సరైన ప్రాక్టికల్‌ అనుభవం లేకపోతే పోటీ ప్రపంచంలో నిలవలేరన్నారు. దేశంలోకాని, ప్రపంచంలోకాని ఉద్యోగాలకోసం విపరీతమైన పోటీ ఉందన్నారు. అన్ని కాలేజీలు నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. లంచాలు ఇస్తే సరిపోతుందన్న భావన కనిపించకూడదని... నిర్దేశించుకున్న ప్రమాణాలను కాలేజీలే ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. 

పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి అవసరమైతే 6 నెలల సమయం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత వాటిపై చర్యలు తప్పనిసరి అని... రాష్ట్రంలో విద్యా ప్రమాణాల్లో నాణ్యత మెరుగుపడుతున్నాయన్న సందేశం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. నియమాలు, నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్న సంకేతం పోవాలన్నారు. 

చంద్రబాబు ఓ నీచుడు...అందుకే చెప్పులతో స్వాగతం..: కొడాలి నాని

ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో కాలేజీలకు ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. విద్యా ప్రమాణాలను  పెంపొందించడానికి ప్రభుత్వం నుంచి  చేయాల్సిందంతా చేద్దామని సీఎం జగన్ కమీషన్ సభ్యులతో అన్నారు.

 

click me!